అలియా భట్‌కు కరోనా నెగెటివ్.. ఊపందుకోనున్న ప్రాజెక్ట్స్

కరోనా సెకండ్ వేవ్ ప్రముఖులపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు.ఈ నెల మొదట్లో అలియా భట్ కరోనా బారిన పడగా, ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. వరుస షూటింగ్స్‌లలో పాల్గొంటున్న నేపథ్యంలో అలియాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే క్వారంటైన్‌కు వెళ్లింది అలియా. రీసెంట్గా బెడ్ పై పడుకొని నీరసంగా కనిపిస్తున్న పిక్ షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ కలలను మేల్కొనపవద్దు అంటూ కామెంట్ పెట్టింది.
అలియా భట్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె నటిస్తున్న కొన్నిప్రాజెక్టులకు బ్రేక్ పడ్డాయి. అయితే బుధవారం సాయంత్రం తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్లూ టీ షర్ట్ ధరించిన ఫొటో షేర్ చేస్తూ.. ఇలాంటి సమయంలోనే నెగెటివ్ అనేది మనకు మంచిగా అనిపిస్తుందని కామెంట్ పెట్టింది. అలియా పోస్ట్‌కు నువ్వు చాలా స్ట్రాంగ్ అని కొందరు కామెంట్ చేస్తే మరి కొందరు ఈ రోజుకు ఇదే ఆనందకరమైన న్యూస్ అని కామెంట్స్ పెట్టారు. అలియా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు గంగూబాయి కతియావాడి , బ్రహ్మాస్త్రా, రణవీర్ సింగ్ కథానాయకుడిగా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్ చిత్రాలతో బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- bollywood
- carona
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

