ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి

నవాబ్‌పేట, ఏప్రిల్ 2 : గడ్డివాము వద్ద ఆడుకొందామని వెళ్లిన ఇద్దరు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఇప్పటూర్‌కు చెందిన ప్రశాంత్(11), విఘ్నేశ్(8)తోపాటు మరో బాలుడు శివకుమార్ గురువారం సాయంత్రం గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లారు. పక్కనే గడ్డివాముపై ఉన్న ట్రాక్టర్ కేజ్ వీల్స్లోకి ప్రశాంత్, విఘ్నేశ్ దిగారు. ఈ సమయంలో ఒక్కసారిగా గడ్డికి నిప్పు అంటుకున్నది. కేజ్ వీల్స్‌లో ఉన్న ఇద్దరు చిన్నారులు అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. బయట ఉన్న శివకుమార్ కేకలు వేయడంతో సమీపంలోని వారు అక్కడికి చేరుకొని నీటితో మంటలను ఆర్పారు. వెంటనే బాలురను మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు విఘ్నేశ్, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రశాంత్ మృతి చెందారు. ప్రశాంత్ తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Children
- Died
- Fire accident
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

