స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత

రెండోసారి ఘన విజయం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎమ్మెల్సీ కవిత ఘనవిజయం సాధించారని రిటర్నింగ్ ఆఫీసర్ మంచాల వరలక్ష్మి ప్రకటించారు. చీఫ్ కమిషనర్గా కవిత ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఆమె 2015లో జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఆమె హయాంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థుల భాగస్వామ్యం మరింత పెరిగేలా కృషిచేస్తానని చెప్పారు. రాష్ట్ర చీఫ్ ప్యాట్రన్, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్తో కలిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను మరింత విస్తృతం చేస్తామని ప్రకటించారు. కవిత మరోసారి చీఫ్ కమిషనర్గా ఎన్నిక కావడంపై స్కౌట్స్ అండ్ గైడ్స్ హర్షం వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

