పిల్లలనూ వదలని కరోనా

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా రెండోవేవ్ చిన్నపిల్లలను కూడా వదలటం లేదు. ముఖ్యంగా 10 ఏండ్ల వయసు పైబడిన పిల్లలు వైరస్ బారినపడుతున్నట్టు దవాఖానల రికార్డుల ద్వారా తెలుస్తున్నది. గతేడాది మొదట ఈ వైరస్ వ్యాపించినప్పుడు చిన్నారులపై తక్కువ ప్రభావం చూపింది. వైరస్ సోకినా ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉండటంతో ఐసీయూలో చేరిన కేసులు కూడా తక్కువగానే నమోదయ్యాయి. ఇప్పుడు రెండోదశ వ్యాప్తిలో పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తున్నది. కొద్దిరోజుల క్రితం పలు పాఠశాలలు, హాస్టళ్లలో 10 నుంచి 15 ఏండ్లలోపు పిల్లలే వైరస్‌బారిన పడ్డారు. ఫస్ట్‌వేవ్‌లో కేవలం 5 శాతం మాత్రమే పిల్లల్లో వైరస్ కనిపించింది. సెకండ్‌వేవ్‌లో ప్రభావం రెట్టింపైనట్టు నిమ్స్, నిలోఫర్ వైద్యులు చెప్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వైరస్ వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సెకండ్‌వేవ్‌లో పిల్లలపై కూడా ఇది ప్రభావం చూపుతున్నది. పిల్లలను బయటకు వెళ్లనీయొద్దు. ముఖ్యంగా తల్లిదండ్రులు సేఫ్‌గా ఉంటే పిల్లలు సేఫ్‌గా ఉన్నట్టే. పెద్దలు బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలి
-డాక్టర్ పరంజ్యోతి, నిమ్స్ హాస్పిటల్
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

