పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి

తల్లిదండ్రులు, నానమ్మ పరిస్థితి విషమం
పెద్దపల్లి, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): నిలువ ఉంచిన పుచ్చకాయ ముక్కలు తిన్న ఇద్దరు సోదరులు చనిపోగా.. వారి తల్లిదండ్రులతోపాటు నానమ్మ అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన దారవేణ శ్రీశైలం- గుణవతి దంపతులకు కొడుకులు శివానంద్(12), చరణ్(10). శ్రీశైలం తల్లిదండ్రులు కొమురయ్య, సారమ్మతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం శ్రీశైలం పుచ్చకాయను తీసుకొచ్చాడు. దానిని సగం మేర కోసి తండ్రి కొమురయ్య మినహా అంతా కలిసి తిన్నారు. మిగతా సగాన్ని దాచి పెట్టారు. మంగళవారం మధ్యాహ్నం మరోసారి తిన్నారు. కాగా, బుధవారం కొమురయ్య మినహా మిగతా వారందరికీ విరోచనాలు మొదలయ్యాయి. అందరూ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్లారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుడి సూచన మేరకు.. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పెద్దలు ముగ్గురు మరో దవాఖానలో చేరారు. శుక్రవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి చరణ్ మృతిచెందగా, తర్వాత కాసేపటికే శివానంద్ ప్రాణాలు కోల్పోయాడు. శ్రీశైలం, గుణవతి, సారమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. కాగా, పుచ్చకాయ విషతుల్యం కావడం వల్లే మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Brothers
- Died
- watermelon
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

