e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home క్రైమ్‌ కబళించిన మృత్యువు

కబళించిన మృత్యువు

కబళించిన మృత్యువు

ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో 19 మంది మృతి
గోదావరిలో ఆరుగురు జలసమాధి
శుభకార్యానికి వెళ్లి మృత్యువాత
పిల్లలను రక్షించబోయి ఐదుగురు..
ఒకరినొకరు కాపాడే క్రమంలో మునక
రెండు కుటుంబాల్లో తండ్రీకొడుకుల దుర్మరణం
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం

రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకే రోజు 19 మంది మృతిచెందారు. చిన్నారి పుట్టువెంట్రుకల కార్యక్రమానికి వెళ్లి నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ ఘాట్‌ వద్ద గోదావరిలో మునిగి ఆరుగురు, బావమరిది కొడుకు అన్నప్రాసనకు వెళ్తూ నల్లగొండ జిల్లా నిడమనూరు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు, స్టడీ మెటీరియల్‌ కోసం వెళ్తూ అనుముల మండలంలో ముగ్గురు, సూర్యాపేట జిల్లాలో ఒకరు దుర్మరణం చెందారు. పెద్దపల్లి జిల్లాలో పుచ్చకాయ ముక్కలు తిని ఇద్దరు అన్నదమ్ములు, పాలమూరులో గడ్డివాము అంటుకొని ఇద్దరు చిన్నారులు చనిపోయారు.

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ పుష్కరఘాట్‌ వద్ద పెను విషాదం చోటుచేసుకున్నది. తలనీలాలిచ్చి, తెప్పదీపం వెలిగించాలని వచ్చిన కుటుంబాల్లో ఆరుగురు నదిలో ముని గి ప్రాణాలు కోల్పోయారు. నదీ స్నానానికి దిగిన ఏడుగురు నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు ఓ బాలుడిని రక్షించగా.. మిగిలినవారు విగతజీవులుగా లభ్యమయ్యారు. ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర సంతా పం వ్యక్తంచేశారు. రెండు కుటుంబాల్లో త్ంర డీకొడుకులు సహా మరో యువకుడు ప్రాణా లు కోల్పోయాడు. మృతుల్లో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన బొబ్బిలి శ్రీనివాస్‌(40), అతని కొడుకులు సిద్ధార్థ్‌ (16), శ్రీకర్‌ (14), మాక్లూర్‌ మండలం డీకంపల్లికి చెందిన జిలకర సురేశ్‌ (40), అతని కొడుకు యోగేశ్‌(16), గుత్ప గ్రామానికి చెందిన దొడ్ల రాజు (24) ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోదనలతో నదీతీరం శోకసంద్రమైంది. తమ కండ్ల ముందు న్న వ్యక్తులు నిమిషాల వ్యవధిలోనే విగతజీవులుగా మారడాన్ని కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. గంగమ్మకు పూజలు చేస్తామని వస్తే… దేవుడు మోసం చేశాడంటూ మహిళలు రోదించిన తీరు కలిచివేసింది.

నిమిషాల్లో మృత్యుఒడికి..

నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామానికి చెందిన దొడ్ల భూమన్న, చిన్నరాజు దంపతులకు ఐదుగురు సంతా నం. వసంత, సంజు, మంజుల, రాధ కుమార్తెలు కాగా కుమారుడు రాజు. వీరితోనే పెరిగిన బంధువుల అమ్మాయి మానస. వీరిలో రాజుకు తప్ప మిగతా అందరికీ వివాహాలు జరిగాయి. శుక్రవారం రాధ-నరేశ్‌ దంపతుల కొడుకు(9నెలలు) పుట్టు వెంట్రుకలు తీసేందుకు నిర్ణయించారు. శుభకార్యానికి రావాలని రాధ తన అక్కలు, సోదరుడు రాజుకు సమాచారం పంపింది. అంతా కలిసి శుక్రవారం ఉదయమే గోదావరి చెంతకు చేరారు. బొబ్బిలి శ్రీకర్‌, రవికాంత్‌ ఘాట్‌ వద్ద మొదటగా నదిలోకి దిగారు. వీరి తర్వాత జిలకర యోగేశ్‌, బొబ్బిలి సిద్ధార్థ్‌ నీళ్లలోకి వచ్చారు. నదిలో నీటి ప్రవాహ తాకిడికి ఘాట్‌కు దూరంగా కొట్టుకుపోయారు. గమనించిన బొబ్బిలి శ్రీనివాస్‌ (40), జిలకర సురేశ్‌ (40), దొడ్ల రాజు (24) పిల్లలను కాపాడుకునేందుకు దిగారు. వీరు కూడా లోతుల్లోకి కూరుకుపోయారు. అప్పటివరకు సందడి చేసిన వారంతా క్షణాల్లో మాయమయ్యారు. గమనించిన స్థానిక మత్స్యకారుడు రాజు నదీ ప్రవాహానికి ఎదురెళ్లి రవికాంత్‌ అనే బాలుడ్ని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. గాలింపు చర్యల్లో ఒక్కో మృతదేహం బయటపడింది. మధ్యా హ్నం ఒంటి గంటకు దొడ్ల రాజు మృతదేహం వెలికి తీశారు. గంట సేపట్లోనే మిగిలిన వారి మృతదేహాలు లభించాయి. సూర నరేశ్‌, రాధ దంపతుల ఫిర్యాదు మేరకు మెండోరా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టంకు తరలించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

గోదావరి నదిలో మునిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరుగురి మృతిపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సంతాపం వ్యక్తంచేశారు. నదిలో మునిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని కలచివేసిందని శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. పోచంపాడ్‌ పుష్కరఘాట్‌ వద్ద జరిగిన ఘటనలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కవిత భరోసా ఇచ్చారు. మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి..

జాతీయ పార్టీలకు ఓటమి తప్పదు

జనమేరి జానా..!

అశోక్‌కు ఎమ్మెల్సీ కవిత అభయం

6 నుంచి ధాన్యం కొనుగోళ్లు

కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి

పిల్లలనూ వదలని కరోనా

స్టడీ మెటీరియల్‌ కోసం వెళ్తూ..

భారం కావొద్దని.. వృద్ధ దంపతులు

ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి

అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు

పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి

గుడ్డు తినండి.. బరువు తగ్గండి

కేసీఆర్‌ ఆపద్బంధు బీసీల బంధువు

స్కౌట్స్‌, గైడ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కబళించిన మృత్యువు

ట్రెండింగ్‌

Advertisement