Loksabha Elections 2024 : సంపద సర్వే గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం యూటర్న్ తీసుకున్నారు. దేశానికి ఏ మేరకు అన్యాయం జరిగిందనేది కనుగొనాలని తాను కోరుకున్నానని వివరణ ఇచ్చారు. తాము చర్యలు తీసుకుంటామని చెప్పలేదని, ఎంత అన్యాయం జరిగిందో తేల్చుకుందామని మాత్రమే చెప్పానని ఢిల్లీ జవహర్ భవన్లో జరిగిన పార్టీ సామాజిక న్యాయ సదస్సులో ప్రసంగిస్తూ రాహుల్ పేర్కొన్నారు.
తాను ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందనేది తెలుసుకోవాలని అనగానే ప్రధాని నరేంద్ర మోదీ ఎలా స్పందిస్తున్నారో చూడంది..ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమని మోదీ గగ్గోలు పెడుతున్నారని అన్నారు. ఎక్స్ రే ద్వారా (సంపద సర్వే) మనం సమస్య ఏంటో తెలుసుకుంటామని రాహుల్ పేర్కొన్నారు. కుల గణన ఎక్స్రే అంటే తమను తాము దేశభక్తులుగా చెప్పుకునే వారు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కులగణనను ఏ శక్తీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. దేశంలో 90 శాతం మందికి అన్యాయం జరిగిందని, వీరికి న్యాయం చేయడమే తన లక్ష్యమని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. అన్యాయాన్ని సరిదిద్దాలని తాను చెప్పగానే ప్రధాని, బీజేపీ తనపై దాడి చేయడం ప్రారంభించాయని అన్నారు. తమ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే ముందుగా కుల గణన చేపడుతుందని చెప్పారు.
Read More :