Lok Sabha Nominations: ఒంటెపై వెళ్లి నామినేషన్ వేసిన స్వతంత్య్ర అభ్యర్థి.. వీడియో
Lok Sabha Nominations: ఔరంగబాద్‌లో స్వతంత్య్ర అభ్యర్థి ఒంటెపై వెళ్లి నామినేషన్ వేశారు. సిటీలోని ప్రధాన రహదారి మీదుగా ఆయన ర్యాలీ తీశారు. విక్టరీ సంకేతాన్ని ఇస్తూ ఆయన ఒంటెపై తిరిగారు.
ఔరంగబాద్: ఎన్నికల వేళ దేశమంతా నామినేషన్ల(Lok Sabha Nominations) పర్వం నడుస్తోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను వేసేందుకు వేర్వేరు పద్ధతుల్లో రిట్నరింగ్ ఆఫీస్‌కు వెళ్తున్నారు. అయితే మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి సాహెబ్ ఖాన్ పఠాన్ వినూత్న రీతిలో తన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు ఆయన ఒంటెపై వెళ్లారు. నగరంలోని బిజీ వీధుల్లో ఆయన ఒంటెపై తిరిగారు. ఒంటెపై వెళ్తూ విక్టరీ సంకేతాన్ని ఇచ్చారాయన. ఔరంగబాద్ నియోజకవర్గంలో మే 13వ తేదీన పోలింగ్ జరగనున్నది. ఆ నియోజకవర్గంలో 30,52,724 ఓటర్లు ఉన్నారు. దీంట్లో 16,00,169 మంది పురుషులు, 14,52,415 మంది మహిళలు, 140 మంది థార్డ్ జెండర్ వ్యక్తులు ఉన్నారు.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra: Independent candidate from Aurangabad Lok Sabha Saheb Khan Pathan went to file his nomination riding a camel. pic.twitter.com/SMZcfIjWlA
— ANI (@ANI) April 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

