కుమ్రంభీం ఆసిఫాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు( Stray dogs ) స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఉంద్రీగాం గ్రామానికి చెందిన సాయితేజ (5) అనే బాలుడు బుధవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేసి(Dog attack) తీవ్రంగా గాయపరిచాయి (Boy injured).
గమనించిన స్థానికులు కుక్కలను తరిమి బాలుడిని హాస్పిటల్కు తరలించారు. కుక్కలు తలపై కరవడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని గ్రామస్తులు భయాం దోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు అధికారులకు మొర పెట్టుకున్నారు.