6 నుంచి ధాన్యం కొనుగోళ్లు

యాసంగి పంట కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటు
జగిత్యాలలో మామిడి మార్కెట్ అభివృద్ధి
కొల్లాపూర్‌లో ఈ సీజన్ నుంచి మామిడి కొంటాం
వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): యాసంగి పంటల కొనుగోలుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్టు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 6 నుంచి విడుతల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ముందుగా సూర్యాపేటలో కేంద్రాలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృదిపై శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగిత్యాలలో పదెకరాల్లో మామిడి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. తాండూరు రైతుబజార్‌ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ మామిడి మార్కెట్లో ఈ సీజన్ నుంచే మామిడి కొనుగోళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. యాసంగి పంటల కొనుగోలు కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రైతులు టార్పాలిన్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

