e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home ఆరోగ్యం గుడ్డు తినండి.. బరువు తగ్గండి

గుడ్డు తినండి.. బరువు తగ్గండి

గుడ్డు తినండి.. బరువు తగ్గండి

రోజూ రెండు తింటే ఊబకాయులకు ప్రయోజనం
అంతర్జాతీయ పరిశోధనలో అద్భుత ఫలితాలు
ఉడికించి, ఆమ్లెట్‌ తినాలని వైద్యుల సూచన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (నమస్తే తెలంగాణ): పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందించడంలో కోడిగుడ్లది కీలకపాత్ర. అందుకే అంగన్‌వాడీల్లో పిల్లలు, గర్భిణులకు గుడ్లను ఆహారంగా అందిస్తారు. చాలామంది డాక్టర్లు కూడా కోడిగుడ్డు తినాలని సలహా ఇస్తుంటారు. పిల్లలు సరిగ్గా బరువు పెరగడంలేదంటే రోజు రెండు గుడ్లు తినాల్సిందే. అదే కోడిగుడ్డు తినడం ద్వారా ఊబకాయులు బరువు కూడా తగ్గొచ్చు. అందుకోసం గుడ్డు తినే విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీ, అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ సర్వేల్లో కోడిగుడ్డు తిని బరువు తగ్గించుకోవచ్చని నిర్ధారణ అయ్యింది.

ఇలా తినాలి

కోడిగుడ్లను చాలా మంది బేకన్‌ (మాంసంతో చేసే పదార్థం), హాష్‌బ్రౌన్స్‌, బ్రెడ్‌, నెయ్యితో కలిపి తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా తింటే శరీరానికి అవసరానికి మించి క్యాలరీలు అందుతాయి. ఇవి శరీర బరువును మరింత పెంచుతాయి. మసాలాలు, కారం, గుడ్డుతో చేసే పదార్థాలు త్వరగా జీర్ణం కావు. ఇలాకాకుండా గుడ్డును ఉడకబెట్టి, ఆమ్లెట్‌ రూపంలో, కూరగాయాలతో కలిపి ఆహారంగా తీసుకోవడం శ్రేయస్కరం. రోజూ తీసుకునే ఆహారంలో మాంసం లేకపోయినా కోడిగుడ్డు ఉండేలా చూసుకుంటే సరిపోతుందని న్యూట్రిషన్‌ నిపుణులు సూచిస్తున్నారు.

కోడిగుడ్డులో ఏం ఉంటాయి?

ఒక కోడిగుడ్డులో 60 క్యాలరీలు, ఆరుగ్రాముల ప్రొటీన్‌, నాలుగు గ్రాముల ఫ్యాట్‌ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌ అసలే ఉండవు. గుడ్డును తినడం ద్వారా విటమిన్‌-బీ లభిస్తుంది. వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇందులో మెదడు ఎదుగుదలకు అవసరమైన కోలిన్‌తో, విటమిన్‌-డీ ఉంటాయి. అందుకే గుడ్డులోని తెల్లసొనపాటు గుడ్డు మొత్తం తినడం మంచిదని న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ నిపుణులు చెప్తున్నారు.

పరిశోధన ఫలితాలు ఇవీ..

ఇంటర్నేషన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబేసిటీ 152 మంది అధిక బరువున్న వ్యక్తులకు ఎనిమిది వారాల పాటు రోజూ ఉదయం రెండు గుడ్లను ఆహారంగా అందించింది. వీరిలో 61 శాతం మంది బీఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) భారీగా తగ్గింది. 65 శాతం మంది బరువు తగ్గగా, 34 శాతం మంది నడుము చుట్టుకొలత తగ్గింది.


అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ సర్వే ప్రకారం 43 మంది అధిక ప్రొటీన్లు (35 శాతం కార్బొహైడ్రేట్స్‌, 40 శాతం ప్రొటీన్స్‌, 25 శాతం కొవ్వు పదార్థాలు) కలిగిన ఆహారం తీసుకున్నప్పటికంటే కోడిగుడ్ల ద్వారా (44 శాతం కార్బొహైడ్రేట్స్‌, 15 శాతం ప్రొటీన్లు, 30 శాతం కొవ్వు) తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసింది. అంతేకాకుండా కోడిగుడ్లను ఆహారంగా తీసుకున్నవారు రోజుకు సగటున 80 క్యాలరీలు ఖర్చు చేయగలిగారు. సాధారణ భోజనం చేసిన వారితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని సర్వేలో తేలింది.

ఇవి కూడా చదవండి..

జాతీయ పార్టీలకు ఓటమి తప్పదు

జనమేరి జానా..!

అశోక్‌కు ఎమ్మెల్సీ కవిత అభయం

6 నుంచి ధాన్యం కొనుగోళ్లు

కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి

పిల్లలనూ వదలని కరోనా

స్టడీ మెటీరియల్‌ కోసం వెళ్తూ..

భారం కావొద్దని.. వృద్ధ దంపతులు

ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి

అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు

పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి

కబళించిన మృత్యువు

కేసీఆర్‌ ఆపద్బంధు బీసీల బంధువు

స్కౌట్స్‌, గైడ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుడ్డు తినండి.. బరువు తగ్గండి

ట్రెండింగ్‌

Advertisement