e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

ఇండియాలో రెండే రెండు మతాలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి క్రికెట్ అయితే మరొకటి సినిమా. ఈ రెండు లేకుండా మనవాళ్లు ఉండలేరు. అంతేకాదు ఈ రెండింటికి మంచి అవినాభావ‌ సంబంధం కూడా ఉంది. సినిమా యాక్ట‌ర్లు, క్రికెట‌ర్లు క‌లిసి యాడ్స్‌లో క‌లిసి న‌టిస్తుంటారు. ఒక‌రినొక‌రు ప్రోత్స‌హించుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్‌, విరాట్ కోహ్లీ విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింది.

అల్లు అర్జున్ హీరోగా వ‌స్తున్న పుష్ప సినిమా టీజ‌ర్ ఇట‌వీల సృష్టించిన సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అల్లు అర్జున్ బర్త్ డేకి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో గంధపు చెక్కల స్మగ్లింగ్‌ చేసే లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్టర్‌ను స్టార్ స్పోర్ట్స్‌ ప్రమోషన్ కోసం వాడుకుంది.

ఏప్రిల్ 9న మొదలైన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మట్టికరిపించి ఈ సీజన్‌లో శుభారంభం చేసింది బెంగళూరు టీం. దాంతో పుష్ప పోస్టర్ లో అల్లు అర్జున్ మొహానికి విరాట్ కోహ్లీ ఫేస్ మార్ఫింగ్ చేశారు. దానికింద తగ్గేదే లే.. స్టార్టింగ్ అదిరింది అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్వీట్ చేసింది. దీనిపై అల్లు అర్జున్ కూడా ఫ‌న్నీగా స్పందించాడు. ఈ పోస్టర్ చూసి ఫిదా అయిపోయాడు. లవ్ ఎమోజీలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పుష్ప ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీన్ని బట్టి మన తెలుగు సినిమా క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది అనేది అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో పాటలను సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ చేసి వరల్డ్ ఫేమస్ చేశాడు. ఇప్పుడు పుష్ప పోస్టర్ విరాట్ కోహ్లీ ఇలా వాడుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

సాయంత్రం ఎన్టీఆర్ 30వ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టేశాడు..!

క‌రోనా పాజిటివ్.. థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన హీరోయిన్

గుడ్ న్యూస్ చెప్పిన యాంక‌ర్ స‌మీరా షరీఫ్

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఖిలాడి టీజ‌ర్

కేటీఆర్‌ సర్‌.. మీరు బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల్లో ప్ర‌యత్నించ‌లేదా?

16 ఏళ్ల త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నున్న లెజండ‌రీ స్టార్స్

హీరోయిన్‌పై నెమ‌లి దాడి.. వీడియో వైర‌ల్

రామ్‌చరణ్‌ చిత్రంలో సల్మాన్‌?

ప‌వ‌ర్ స్టార్‌కు పెద్ద షాక్ ఇచ్చిన యువర‌త్న

దక్షిణాది అవకాశాలువస్తున్నాయి!

అరణ్య క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే..

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సైడ్ బిజినెస్ అదిరింది

చిరంజీవి లూసీఫర్ రీమేక్ కు అదిరిపోయే టైటిల్

టాలీవుడ్‌కు క‌ష్ట‌మే : తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ థియేట‌ర్ల బంద్ ?‌

వకీల్ సాబ్ సినిమాలో పవన్ తెలంగాణ యాసకు కారణం ఇదే..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తగ్గేదే లే.. విరాట్ కోహ్లీ గెటప్ కు అల్లు అర్జున్ ఫిదా..

ట్రెండింగ్‌

Advertisement