ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 11:32:19

ఆసుప‌త్రిలో పెళ్ళి రోజు జరుపుకున్న బాలు..!

ఆసుప‌త్రిలో పెళ్ళి రోజు జరుపుకున్న బాలు..!

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం గ‌త కొద్ది రోజులుగా క‌రోనాతో ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌ త‌న 51వ వివాహ వార్షికోత్స‌వాన్ని ఆసుప‌త్రిలోనే శ్రీమ‌తితో క‌లిసి చేసుకున్నాడ‌ని తమిళ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. డాక్ట‌ర్లు, ఐసీయూ సిబ్బంది న‌డుమ బాలు ఈ వేడుక జ‌రుపుకున్న‌ట్టు స‌మాచారం. ఈ దంప‌తులు ఇద్ద‌రు కేక్ కూడా క‌ట్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 

మ‌రోవైపు ఎస్పీ బాలసుబ్రమణ్యం  పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాబోతున్న తరుణంలో ఆసుపత్రి నుండి ఆయన ఓ పాట‌ని ఆల‌పించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆయ‌న పాడిన ఆడియో క్లిప్ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. కాగా బాలు ఆగ‌స్ట్‌ 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో క‌రోనాతో అడ్మిట్ అయిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం గుడ్ న్యూస్ రాబోతుంద‌ని ఆయ‌న త‌న‌యుడు చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా తెలియ‌జేశాడు.


logo