‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్లకు పైగా లాభాలు తెచ్చిన విజువల్ వండర్

తెలుగు ఇండస్ట్రీ స్థాయితో పాటు మార్కెట్ ను కూడా తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెట్టిన సినిమా బాహుబలి. తొలి భాగంతోనే 400 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన రాజమౌళి.. రెండో భాగంతో దాన్ని మించి మాయ చేసాడు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయింది. 2017, ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 విడుదలైంది. తొలిరోజే ఈ చిత్రానికి 120 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఇది చూసి బాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. ఇప్పటికీ అదే రికార్డు.. ఈ సినిమాను కొట్టే సినిమా ఇంతవరకు రాలేదు. ఈ నాలుగేళ్లలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి కానీ బాహుబలి 2ను బీట్ చేసిన సినిమా మాత్రం రాలేదు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం అప్పట్లో ఎంత వసూలు చేసిందో ఒక్కసారి చూద్దాం..
నైజాం- 66.90 కోట్లు
సీడెడ్- 34.78 కోట్లు
ఉత్తరాంధ్ర- 26.47 కోట్లు
ఈస్ట్- 17.04 కోట్లు
వెస్ట్- 12.31 కోట్లు
గుంటూరు- 18.01 కోట్లు
కృష్ణా- 14.10 కోట్లు
నెల్లూరు- 8.04 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)-197.65 కోట్లు
కర్ణాటక- 62.00 కోట్లు
తమిళనాడు- 81.00 కోట్లు
కేరళ- 32.12 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 281.05 కోట్లు
ఓవర్సీస్- 160.28 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 814.10 కోట్లు
‘బాహుబలి2’ సినిమాకు అప్పట్లో నభూతో అన్న స్థాయిలో బిజినెస్ జరిగింది. సినిమాపై ఉన్న హైప్ కు తగ్గట్లుగానే నాలుగేళ్ల కిందే 350 కోట్లకు అమ్మారు ఈ సినిమాను. అప్పట్లో ఇంత వస్తుందా అని అంతా కంగారు పడ్డారు కానీ విడుదలైన తర్వాత ఈ చిత్ర ప్రభంజనం చూసి అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 450 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది బాహుబలి 2. కేవలం థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలోనే 814 కోట్లకు పైగా వచ్చాయి. 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. ఇప్పటికీ బాహుబలి 2 రికార్డులు అలాగే ఉన్నాయి.
ఇవికూడా చదవండి
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

