న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో భారత్‌కు అండగా నిలుస్తామని పలు దేశాలు ప్రకటించాయి. అందులో భాగంగానే పలు దేశాలు వైద్య సామాగ్రి, ఆక్సిజన్‌ను భారత్‌కు అందిస్తూ తమవంతు సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలో కెనడా ప్రభుత్వం కూడా 10 మిలియన్ అమెరికన్ డాలర్లను ఆర్థిక సాయంగా ప్రకటించింది.
మానవతా దృక్పథంతో 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను కెనడియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నట్లు కెనడా అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రి కరీనా గౌల్డ్ తెలిపారు. ఆ నిధులతో భారత్‌లో కరోనా కరోనా బాధితుల సహాయార్థం తన వంతు కృషి చేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కెనడియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్థిక దన్నుగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో