సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న మహేష్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాడు. కాని కరోనా వలన షూటింగ్ ఆగిపోవడంతో ఆ టైంకు వస్తారా, రారా అనేది సస్పెన్స్‌గా మారింది. అయితే సర్కారు వారి పాట చిత్రం తర్వాత మహేష్ ఎవరితో చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొనగా, దీనికి సంబంధించిన అప్డేట్ సాయంత్రం రానుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో మహేష్ తన 28వ సినిమా చేయనుండగా, ఈ సినిమా అప్డేట్ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రానుంది. నెల తొలి రోజు సర్ప్రైజింగ్ అప్డేట్ ఇస్తున్న మహేష్ నెలాఖరున కూడా అదిరిపోయే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అయితే అందరు సాయంత్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ ప్రకటనతో మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయబోతున్నట్టు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కన్ఫాం చేయనున్నట్టు అర్ధమవుతుంది.
The 👌 news you'll been waiting for is finally here!!! 🤩💫
— Naga Vamsi (@vamsi84) May 1, 2021
04:05pm, today!
Stay tuned. @haarikahassine pic.twitter.com/4jdfRDS2la