షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్ | భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది.

చెన్నై : భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ తెలిపింది. ఇటీవల టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ట్వీట్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు పిల్లలకు పాజిటివ్‌గా తేలింది.
పిల్లల కారణంగా అందరికీ వైరస్ వ్యాపించింది. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం ఓ పీడకలలా గడిచింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి’ అని ప్రీతి ట్వీట్లలో సూచించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ సీజన్‌కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో లీగ్ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్ అశ్విన్. ప్రాణాంతక కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్ వాయిదా!
జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

