భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు | భారత్‌లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

వాషింగ్టన్ : భారత్‌లో కరోనా ఉధృతి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 4వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వైట్ హౌట్ శుక్రవారం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సలహా మేరకు.. భారత్ నుంచి నుంచి ప్రయాణాలను పరిమితం చేయనున్నట్లు ప్రెస్ సెక్రెటరీ జెన్‌సాకి పేర్కొన్నారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్‌లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.
భారత్‌లో గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బహుళ వేరియంట్లతో వైరస్ వేగంగా విస్తరిస్తోందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ (సీడీసీ) నిర్ధారించింది. బీ.1.617 వైరస్ వేరియంట్ భారత్‌లో కేసుల పెరుగుదలకు కారణమని సీడీసీ భావిస్తోంది. ఈ మేరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు చురుకైన చర్యలు అవసరమని సీడీసీ తేల్చినట్లు ప్రెస్ సెక్రెటరీ పేర్కొన్నారు. అమెరికా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డుదారులు, వారి భార్యలు, 21 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్ వాయిదా!
జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

