తెలంగాణలో కొత్తగా 7,754 కరోనా కేసులు
తెలంగాణలో 7,754 కరోనా కేసులు | తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగున్నది. గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగున్నది. గడిచిన 24 గంటల్లో 7,754 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. కొత్తగా 6,542 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 3,62,160 మంది కోలుకున్నారు. మరో 51 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,312కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో మరణాల రేటు 0.52శాతంగా ఉందని, రికవరీ రేటు 81.68 శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు రాష్ట్రంలో 77,930 టెస్టులు చేసినట్లు చెప్పింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,507 ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 630, రంగారెడ్డిలో 554, సంగారెడ్డిలో 325, కరీంనగర్లో 281, మహబూబ్‌నగర్‌లో 279, సిద్దిపేటలో 279, నిజామాబాద్‌లో 267, జగిత్యాలలో 255, సూర్యాపేటలో 242, వికారాబాద్‌లో 242, నల్లగొండలో 231, ఖమ్మంలో 230, మంచిర్యాలలో 216, వరంగల్ రూరల్‌లో 208 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
తెలంగాణలో రెండు రోజులు వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన బోయింగ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

