భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన బోయింగ్
భారత్‌కు పది మిలియన్ డాలర్ల సాయం ప్రకటిచిన బోయింగ్ | కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ఏరో స్పేస్ దిగ్గజం అండగా నిలిచింది. పది మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీ శుక్రవారం ప్రకటించింది.

వాషింగ్టన్ : కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ఏరో స్పేస్ దిగ్గజం బోయింగ్ అండగా నిలిచింది. పది మిలియన్ డాలర్ల అత్యవసర సహాయ ప్యాకేజీ శుక్రవారం ప్రకటించింది. మహమ్మారిపై పోరాడుతున్న వారికి వైద్య పరికరాలు అందించడం సహా ఇతర కార్యక్రమాలు చేపడుతున్న భారత్‌లోని సంస్థలకు ఈ సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. బోయింగ్‌ను ప్రపంచ పౌరుడిగా అభివర్ణించిన ఆ సంస్థ సీఈఓ డేవ్ కల్హౌన్.. మహమ్మారి ప్రపంచంలోని కమ్యూనిటీలను నాశనం చేసిందన్న ఆయన.. ఈ విపత్కర సమయంలో భారత్‌లోని ప్రజలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
వైద్య, ప్రభుత్వ, ప్రజారోగ్య నిపుణులతో సంప్రదించి అత్యవసరంగా అవసరమయ్యే ప్రాంతాలకు సహాయం అందించేందుకు స్థానిక, అంతర్జాతీయ సంస్థలను భాగస్వాములను చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బోయింగ్ ఉద్యోగులు సైతం భారత్ సహాయ కార్యక్రమాల కోసం వ్యక్తిగతం విరాళాలు ఇవ్వొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగి ఇచ్చిన విరాళానికి అంతే మొత్తాన్ని జమ చేసి సహాయంలో సంస్థ భాగమవుతుందని పేర్కొంది. మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నంలో బోయింగ్ భారతీయ ప్రజలకు సంఘీభావంగా నిలబడడమే కాకుండా.. సమస్య పరిష్కారంలో భాగస్వాములమవుతామని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
తెలంగాణలో రెండు రోజులు వానలు
జపాన్‌లో భారీ భూకంపం
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

