మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ | కరోనాకు వ్యతిరేకంగా అత్యవసర వినియోగం కోసం మోడెర్నా వ్యాక్సిన్ లిస్ట్ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

జెనీవా : కరోనాకు వ్యతిరేకంగా అత్యవసర వినియోగం కోసం మోడెర్నా వ్యాక్సిన్ లిస్ట్ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాక్సిన్ సమర్థతను మదింపు చేయలేని దేశాలు సాధ్యమైనంత త్వరగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అలాగే కోవాక్స్ వ్యాక్సిన్ షేరింగ్ స్కీమ్, పేద దేశాలకు పంపిణీ చేయడానికి సహాయపడుతుందని చెప్పింది. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు టీకాలను లిస్ట్ చేయగా.. మోడెర్నా టీకా ఐదవది. అమెరికాలో అత్యవసర వినియోగానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గతేడాది డిసెంబర్ 18న మోడెర్నా టీకాకు అనుమతి జారీ చేసింది.
అలాగే యూరోపియన్ యూనియన్‌లో చెల్లుబాటయ్యేలా యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఈ ఏడాది జనవరి 6న మార్కెటింగ్‌కు అనుమతులు మంజూరు చేసింది. వ్యాక్సిన్ 94.1 శాతం సామర్థ్యం కలిగి ఉందని స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇక్స్పర్ట్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎస్జీఈ) గుర్తించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. 2022 నాటికి ఐరోపా, యూఎస్‌లో మూడు బిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు మోడెర్నా కంపెనీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
తెలంగాణలో రెండు రోజులు వానలు
జపాన్‌లో భారీ భూకంపం
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్ వాయిదా!
జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

