తెలంగాణలో రెండు రోజులు వానలు
తెలంగాణలో రెండు రోజులు వానలు | ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు, సెంట్రల్, పశ్చిమ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడి న

హైదరాబాద్ : ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు, సెంట్రల్, పశ్చిమ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం జీహెచ్ఎంసీతోపాటు వికారాబాద్, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లోని 20కిపైగా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన కురిసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా దోమ గ్రామంలో 22.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొన్నిచోట్ల చిరుజల్లులు పడినట్టు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం 36.6 నుంచి 42.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
భారత్‌లో విషాదక పరిస్థితులు : అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హార్యిస్
షాకింగ్.. క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి పాజిటివ్
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్ వాయిదా!
జేఈఈ అడ్వాన్స్డ్ వాయిదా?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

