హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఎస్టీ ధ్రువీకరణ పత్రాలను తెలంగాణ సర్కార్ మంజూరు చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ నేషనల్ ఎస్టీ కమిషన్‌కు తెలంగాణ కమ్మర తెగ ఎస్టీ సంఘం ఫిర్యాదు చేసింది. కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇరపురి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు సూర్తికార్ సీతారామ్, నాయకపు మహేశ్వరం, ఇరాపురం మల్సూర్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో కూడా తమ తెగను 10వ వరుసలో గుర్తించారని, కానీ ఇటీవల కాలం నుంచి తమకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీల్లోని కమ్మరి కులస్తులతో తమకు పోలిక లేదని, తాము ఎస్టీ జాబితాలోని కమ్మర తెగకు చెందినవాళ్లమని వివరించారు.