Kirti Kulhari | సైబర్ మోసాల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు క్యాంపెయిన్‌ను చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు, అధికార యంత్రాంగం ఎంత అవగాహన కల్పించినా సైబర్ మోసాలకు పుల్ స్టాప్ పడటం లేదు. సామాన్యులు, అధికారులు, సెలబ్రిటీలు సైబర్ బాధితుల జాబితాలో చేరిపోతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి సైబర్ మోసానికి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు నటి కీర్తి కుల్హరి మొబైల్‌ఫోన్, క్రెడిట్ కార్డ్‌ను హ్యాక్ చేసి రూ.2.4 లక్షలు దోచుకున్నారు.
తన ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా కావడంతో అప్రమత్తమైన కీర్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ స్కాం వెనుకున్న వ్యక్తులెవరో గుర్తించి డబ్బును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ ఇండియాలో ఎలా రెచ్చిపోతున్నారో..? తాజా ఘటన మరోసారి చెప్పకనే చెబుతోంది. పింక్, మిషన్ మంగళ్, యురి ది సర్జికల్ స్ట్రైక్స్, ఇందూ సర్కార్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కీర్తి కుల్హరి.
Municipal Commissioner | భద్రకాళి బండ్‌పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు