తుంగతుర్తి, జూలై 30 : తుంగతుర్తి మండల కేంద్రంలోనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం క్యాంప్ కార్యాలయం నుండి ఆయన పత్రిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫైర్ స్టేషన్ను తుంగతుర్తి మండల కేంద్రంలోని ఏర్పాటు చేస్తామని వేరే ప్రాంతానికి తరలించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రకటనపై తుంగతుర్తి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.