హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్కకొమురయ్య డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, మాడల్ స్కూల్ సిబ్బందికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య పాల్గొన్నారు.