Siddaramaiah : కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. 2028లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తన వయసు, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజకీయాలు పెరిగిపోతుండటం కారణంగా తాను 2028 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. మాండ్య జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ రంగం అవినీతిమయంగా మారింది. అందువల్లే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. అయినప్పటికీ నేను రాజకీయాల్లోనే కొనసాగుతాను. ప్రజా జీవితంలో ప్రజల కోసం పని చేస్తా. ప్రజల ఇబ్బందులపై నా గళం విప్పుతా. ప్రజల సంతోషం కోసం పనిచేస్తా. నా వరుణ నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్లీ పోటీ చేయమని అడుగుతున్నారు. కానీ, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా అంటూ సిద్ధరామయ్య ప్రకటించారు. ఇదే అంశంపై తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 79. ఇంతకాలం కాంగ్రెస్ తరఫున సీఎంగా కొనసాగిన సిద్ధరామయ్య ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు.
ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರ ಇಂದು ಕಲುಷಿತಗೊಂಡಿರುವುದರಿಂದ 2028ರ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ನಾನು ಸ್ಪರ್ಧಿಸುವುದಿಲ್ಲ. ಆದರೆ, ಸಕ್ರಿಯ ರಾಜಕಾರಣದಲ್ಲಿದ್ದು, ಜನರ ಕಷ್ಟ, ಸುಖಗಳಿಗೆ ಧ್ವನಿಯಾಗಿ ನಿಲ್ಲುತ್ತೇನೆ.
ಮತ್ತೊಮ್ಮೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸುವಂತೆ ವರುಣ ಕ್ಷೇತ್ರದ ಜನರು ಒತ್ತಾಯಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ನಾನು ಇನ್ನು ಮುಂದೆ ಯಾವುದೇ… pic.twitter.com/v0S4tCQ30o
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2026
ఆయన తర్వాత డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సిద్ధరామయ్య 1978 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2028 నాటికి ఆయన రాజకీయాల్లో ఉంటారు. అప్పటికి తన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. అదే సమయంలో ఆయనకు అప్పటికి 82 ఏళ్లు వస్తాయి. అందుకే ఆయన వయసురీత్యా కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య ప్రస్థానం చాలా ప్రత్యేకం.