IPL Stars : జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత కుర్రాళ్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh), హర్ష్ దూబే (Harsh Dubey)లకు తుది జట్టులో చోటే దక్కలేదు. వరసగా రెండు విజయాలతో సిరీస్ సొంతమైనందున కనీసం ఆఖరిదైన మూడో మ్యాచ్‌లోనైనా తమకు అవకాశం వస్తుందని ఎదురుచూసిన వీరికి నిరాశే మిగిలింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బౌలింగ్ దళంలో కీలకమైన దూబేను అంతదూరం తీసుకెళ్లి.. బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. దాంతో, టీ20ల్లో ఈ ఇద్దరి అరంగేట్రం ఇంకెప్పుడు? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్లో నిలకడగా రాణించి సెలెక్టర్ల దృష్టిలో పడిన ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబేలు.. మైదానంలోకి మాత్రం దిగలేకపోయారు. ఇంగ్లండ్ చేతిలో వైట్‌వాష్ అనంతరం స్క్వాడ్‌లోకి వచ్చిన ఈ ఇద్దరూ జింబాబ్వే పర్యటనలో తమకు అవకాశం వస్తుందని అనుకున్నారు. కానీ, పేసర్లు అశోక్ శర్మ(Ashok Sharma), యశ్ ఠాకూర్ (Yash Thakur)లకు మాత్రమే తుది జట్టులో చోటు దక్కగా. దూబే, ప్రభ్సిమ్రన్లకు మాత్రం నిరాశ తప్పలేదు.
Gotta feel for Prabhsimran Singh and Harsh Dubey, who did not get to make their T20I debuts during the India-Zimbabwe series. 🇮🇳😢#ZIMvIND #T20Is #Harare #Sportskeeda pic.twitter.com/lQWKiJ5bhY
— Sportskeeda (@Sportskeeda) July 26, 2026
వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ (Ishan Kishan) రాణించడం, ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)కి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించడంతో ప్రభ్‌సిమ్రన్‌కు జట్టు కూర్పులో చోటే దక్కలేదు. అదే.. స్పిన్ ఆల్‌రౌండర్ దూబేకు అయినా అవకాశం ఇస్తారనుకుంటే అతడిని కాదని ఇద్దరు పేసర్లకు డెబ్యూ క్యాప్ అందించారు. దాంతో.. రాబోయే సిరీస్‌లలో అయినా తమకు అవకాశం రాకపోతుందా? అనే అశాభావంతో ఉన్నారు హర్ష్ దూబే, ప్రభ్‌సిమ్రన్.
Make that a 2️⃣nd T20I half-century 🫡
Vaibhav Sooryavanshi putting on a show again in Harare 👏#TeamIndia 95/1 after 10 overs.
Updates ▶️ https://t.co/oApMpI6eRc#ZIMvIND pic.twitter.com/8AQsYGdi3h
— BCCI (@BCCI) July 26, 2026
విధ్వంసక ఓపెనర్‌గా పేరొందొన ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఐపీఎల్లో సూపర్ హిట్టయ్యాడు. ప్రతి సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు శుభారంభాలిస్తున్న ఈ చిచ్చరపిడుగు మొత్తంగా 65 మ్యాచుల్లో 156.33 స్ట్రయిక్ రేటుతో 1,815 పరుగులు సాధించాడు. ఈ లీగ్‌లో అతడి పేరిట ఒక శతకం, 13 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్ష్ దూబే.. 12 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. అతడి అత్యుత్తమ ప్రదర్శన 3/12.