e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home ఆరోగ్యం బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నా ఇంకా భ‌యాలు వీడ‌టం లేదు ! బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ అంటూ అనేక ర‌కాల‌ ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు బాధిస్తున్నాయి. వీటి చికిత్స‌కు కూడా పెద్ద మొత్తంలోనే ఖ‌ర్చ‌వుతుంది. కాబ‌ట్టి ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో చేరితే చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చు సామాన్యుడికి త‌ల‌కు మించిన భారంగా మారుతుంది. ఇలాంటి స‌మ‌యంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్లైయిమ్ చేసుకుందాం అంటే.. అస‌లు ఈ ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల‌కు బీమా వ‌ర్తిస్తుందా లేదా అనే సందేహాలు ఉన్నాయి. ఇంత‌కీ బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల‌కు బీమా వ‌ర్తిస్తుందా లేదా ఒక‌సారి చూద్దాం..

బ్లాక్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ వ‌ర్తిస్తుందా?

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌ల‌కు సంబంధించిన చికిత్స ఖ‌ర్చుల‌న్నీ స‌మ‌గ్ర ఆరోగ్య బీమా పాల‌సీలు డిఫాల్ట్‌గా వ‌ర్తిస్తాయి. కాబ‌ట్టి వీటికోసం ప్ర‌త్యేకించి కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీలు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఈ విష‌యాన్ని ఇన్సూరెన్స్ దేఖో కో ఫౌండ‌ర్‌, సీఈవో అంకిత్ అగ‌ర్వాల్ స్ప‌ష్టం చేశారు. కాక‌పోతే హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీకి సంబంధించిన నిబంధ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే ఇంత‌కుముందు నుంచే ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి పాల‌సీ తీసుకునే ముందు చెప్పాల్సి ఉంటుంది. ఎమ‌ర్జెన్సీగా ఆస్ప‌త్రిలో చేరాల్సి వ‌చ్చిన‌ప్పుడు, డాక్యుమెంట్లు స‌మ‌ర్పించాల్సి వ‌చ్చిన‌ప్పుడు అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే జ‌ర‌గాలి. అయితే ఈ ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవాలంటే క‌నీసం 24 గంట‌ల పాటు ఆస్ప‌త్రిలో చేరి ఉండాలి.

కొవిడ్ స్పెసిఫిక్ పాల‌సీల్లో వ‌ర్తిస్తుందా?

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?
- Advertisement -

ఉద్యోగుల‌కు సంస్థ‌లు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ లేదా సూప‌ర్ టాప్ అప్ ప్లాన్ల కింద కూడా ఈ ఫంగ‌ల్ వ్యాధుల‌కు బీమా క‌వ‌ర్ అవుతుంది. కానీ క‌రోనా స్పెసిఫిక్ పాల‌సీలు మాత్రం ఈ ఫంగ‌ల్ వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌చ్చు. కొవిడ్ చికిత్స‌లో భాగంగా తొంద‌ర‌గా కోలుకునేందుకు ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. వీటివ‌ల్ల మ్యూకోర్‌మైకోసిస్ ( బ్లాక్ ఫంగ‌స్ ) వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. అయిన‌ప్ప‌టికీ కొవిడ్ స్పెసిఫిక్ పాల‌సీలు ఈ బ్లాక్ ఫంగ‌స్ చికిత్స‌ను క‌వ‌ర్ చేయక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఫంగ‌ల్ ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖ‌ర్చును సెటిల్‌మెంట్ చేస్తున్నాయ‌ని పాల‌సీ ఎక్స్ సీఈవో న‌వాల్ గోయెల్ వెల్ల‌డించారు.

బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్ చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును హెల్త్ ఇన్సూరెన్స్ కింద క్లైయిమ్ చేసుకోవ‌చ్చు. అదే క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కావాలంటే మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ నెట్‌వ‌ర్క్ కింద ఉన్న ఆస్ప‌త్రిలోనే చేరాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లైయిమ్‌లో ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండాల‌న్నా.. తొంద‌ర‌గా సెటిల్‌మెంట్ కావాల‌న్నా కావాల్సిన అన్ని డాక్యుమెంట్ల‌ను సేక‌రించి ఇన్సూరెన్స్ కంపెనీల‌కు అందించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

monoclonal antibody treatment : ఒక్క‌రోజులోనే క‌రోనా ల‌క్ష‌ణాలు ఖ‌తం? అస‌లేంటి ఆ ట్రీట్‌మెంట్ ? ఎవ‌రికి అవ‌స‌రం ?

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Post Corona symptoms : క‌రోనా త‌గ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?
బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?
బ్లాక్ ఫంగ‌స్‌, వైట్ ఫంగ‌స్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ క‌వ‌ర్ చేస్తుందా?

ట్రెండింగ్‌

Advertisement