Realme | న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: రియల్మీ.. దేశీయ మార్కెట్కు చౌక ధర కలిగిన 5జీ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంట్రీలెవల్ స్మార్ట్ఫోన్ ప్రారం భ ధర రూ.9,999గా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ ఫోన్ల లో 4జీబీ+64జీబీ మాడల్ ధర రూ. 10,499, 4జీబీ+128జీబీ మాడల్ ధర రూ.11,499, 6జీబీ+128జీబీ ధర రూ.12,499కి విక్రయించనున్నది. ఈ నెల 30 లోగా రియల్మీ.కామ్, ఫ్లిప్కార్ట్లో బుకింగ్ చేసుకున్నవారికి రూ.1,000 వరకు ఆఫర్ ఇస్తున్నాయి.