Yes Bank | ముంబై, ఏప్రిల్ 27: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యెస్ బ్యాంక్ లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. స్టాండ్లోన్ ప్రతిపాదితన 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికిగాను రూ.452 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.202.43 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మొండి బకాయిల కోసం నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ, సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు.