e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

న్యూఢిల్లీ: చైనాలో సొంత బ్యాంకుల హ‌వా.. భార‌త్‌లో నియంత్ర‌ణ ఆంక్ష‌లు… డిజిట‌ల్ పేమెంట్స్ పెరుగుద‌ల.. విదేశీ బ్యాంకుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. ఈ రెండు దేశాల్లో ఉనికి కాపాడుకునేందుకు విదేశీ బ్యాంకులు విలవిల్లాడుతున్నాయి.

రెండు దేశాల్లోనూ స్థానిక బ్యాంకులు బ‌లోపేతం అయ్యాయి. ప్ర‌త్యేకించి క‌న్జూమ‌ర్ ఫైనాన్సింగ్‌లో పుంజుకున్నాయి. ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించేందుకు బ్యాంకుల‌మ‌ధ్య గ‌ట్టి నెల‌కొడంతో ఓవర్సీస్ బ్యాంకులు నిల‌బ‌డ‌లేక‌పోతున్నాయ‌న్న విమ‌ర్శ ఉంది.

భార‌త్‌, చైనాల‌తో స‌హా 11 దేశాల్లో క‌న్జూమ‌ర్ బిజినెస్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు సిటీ గ్రూప్ ప్ర‌క‌టించింది. ఈ రెండు దేశాల్లో గ‌త ద‌శాబ్ద కాలంగా బిలియ‌న్ల డాల‌ర్లు కుమ్మ‌రిస్తున్నా మార్కెట్‌లో వాటా పొందేందుకు ఇబ్బందుల పాల‌వుతున్నాయి.

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ మెకెన్సీ అండ్ కో వెల్ల‌డించిన డేటా ప్ర‌కారం ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న చైనాలో ద‌శాబ్ద క్రితం విదేశీ బ్యాంకుల వాటా 1.8 శాతం అయితే, 2020లో 1.2 శాతానికి ప‌డిపోయింది. భార‌త్లో 7.2 నుంచి 6.8 శాతానికి దిగొచ్చింది.

భార‌త్‌, చైనాల్లో లాభాలు గ‌డించ‌డానికి విదేశీ బ్యాంకులు చెమ‌టోడుస్తున్నాయి. 2007లో కార్యక‌లాపాలు నిర్వ‌హించేందుకు సిటీ గ్రూప్‌కు చైనా అనుమ‌తి ఇచ్చింది. వీటితోపాటు హెచ్ఎస్‌బీసీ, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్ త‌దిత‌ర బ్యాంకులు కూడా చైనాలోకి అప్పుడే ఎంట‌ర‌య్యాయి.

ఇత‌ర బ్యాంకుల‌తో పోటీ ప‌డేందుకు చైనా నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేసినా విదేశీ బ్యాంకులు ముంద‌డుగు వేయ‌లేక‌పోతున్నాయి. ఓవ‌ర్సీస్ బ్యాంకుల‌కు డ్రాగ‌న్ మిన‌హాయింపులు కొన‌సాగిస్తూనే ఉంది.

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

చైనాలో బ్యాంకులు ఏర్పాటు చేయాలంటే 10 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డు పెట్టాల‌న్న నిబంధ‌న‌నూ ఎత్తేశారు. కానీ చైనా ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుతో ఎదిగిన దేశీయ ఆర్థిక సంస్థ‌లు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ప‌ట్టు బిగించాయి..

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

దేశీయ బ్యాంకుల యాజ‌మాన్యాల‌కు, ప్ర‌భుత్వాధినేత‌ల‌తో దీర్ఘ‌కాలిక సంబంధాలు ఆ బ్యాంకులు దూసుకెళ్ల‌డానికి వెసులుబాటు క‌ల్పిస్తున్నాయి.

ఇప్ప‌టికైతే సిటీ గ్రూప్ ఈ రెండు దేశాల్లో కార్య‌క‌లాపాల‌కు స్వ‌స్తి ప‌లుకాల‌ని నిర్ణ‌యించినా.. ఇంకా హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్‌, సింగ‌పూర్ డీబీఎస్ గ్రూప్ త‌దిత‌ర సంస్థ‌లు భ‌విష్య‌త్‌లో త‌మ ఎదుగుద‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్నాయి.

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

కాస్త భార‌త్‌లో భిన్న‌మైన ప‌రిస్థితి ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు. దేశీయ బ్యాంకుల‌తో పోలిస్తే విదేశీ బ్యాంకులు త‌మ స‌గ‌టు ఆస్తుల‌పై అధిక లాభాలే గ‌డిస్తున్నాయి. భారీగా శాఖ‌ల‌ను విస్త్రుత స్థాయిలో విస్త‌రించ‌డానికి నిరాస‌క్త‌త చూపుతున్నాయి.

భార‌త్‌లో డీబీఎస్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిష‌స్ స‌హా 46 విదేశీ బ్యాంకులు సేవ‌లందిస్తున్నాయి. గ‌త 18 నెల‌ల్లో విదేశీ బ్యాంకుల రుణాలు పెరుగ‌లేదు. డిసెంబ‌ర్‌తో ముగిసిన త్రైమాసికంలో విదేశీ బ్యాంకులిచ్చిన రుణాలు 5.7 శాతానికి ప‌డిపోయాయి. అంత‌కుముందు త్రైమాసికంలో 7.1 శాత‌మే.

డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

దేశీయ బ్యాంకులు ఆరు శాతానికి పైగా రుణాలిచ్చాయి. అయితే కొన్ని బ్యాంకులు వెల్త్ మేనేజ్మెంట్‌లో గ్రోత్ ఉంటుంద‌ని ఆశాభావంతో ఉన్నాయి.

ఇదిలా ఉంటే, దేశంలో న‌ష్టాల్లో ఉన్న ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌ను ఆర్బీఐ, కేంద్రం ద‌న్నుతో డీబీఎస్ టేకోవ‌ర్ చేసుకోవ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

బ్యాంకింగ్ సేవ‌ల్లో డిజిట‌ల్ మార్కెట్ గేమ్ చేంజ‌ర్‌గా మారుతుంద‌ని మెకెన్సీ అంచ‌నా వేసింది. డిజిట‌ల్ రంగంలో బ్యాంకింగ్ సేవ‌ల‌ను బ‌లోపేతం చేస్తే విజ‌యం సాధిస్తారంటున్న‌ది.

ఇవి కూడా చదవండి..

ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ ప‌ల్టీ.. అది కరోనా మ‌హిమ‌!

సముద్రంలో విమానం అత్యవసర ల్యాండింగ్‌.. వీడియో వైరల్‌

డిఫాల్టర్లకు సైతం మరిన్ని రుణాలు

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా కీర్తి సురేశ్

ఎల్ఐసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌.. 16% వేత‌నాల పెంపు


పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది

57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!

త్వరలో కరోనా మూడో వేవ్‌ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే

ప్రిన్సిపాల్‌ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య

నిత్యం 3 లక్షల రెమ్‌డెసివిర్‌ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్‌ మాండవీయ

కరోనా నివారణకు 8 మార్గాలు

రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్‌

పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు

ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్‌ఖాన్‌

రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు

బతుకుదెరువు కోసం ఆటో న‌డుపుతున్న జాతీయ బాక్సర్

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డ్రాగ‌న్ బ్యాంకులు.. భార‌త్ ఆంక్ష‌లు.. సిటీ నిష్క్ర‌మ‌ణ ఎందుకంటే!

ట్రెండింగ్‌

Advertisement