రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
రాత్రి వేళల్లో పనిచేయవలసి ఉంటుందని చెప్పి మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరా? పని స్వభావం ఆధారంగా మహిళలకు ఉపాధి హక్కును నిరాకరించలేరు అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

కొచ్చి : రాత్రి వేళల్లో పనిచేయవలసి ఉంటుందని చెప్పి మహిళలకు ఉద్యోగాలు ఇవ్వరా? పని స్వభావం ఆధారంగా మహిళలకు ఉపాధి హక్కును నిరాకరించలేరు అని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీ విషయంలో కేరళ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. సదరు సంస్థ తీరును తప్పుపట్టింది. ఉద్యోగాల నోటిఫికేషన్‌ను కోర్టు రద్దు చేసింది.
కేరళకు చెందిన మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్‌లో సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయకుండా నిబంధనలు విధించారు. ఈ నోటిఫికేషన్‌ను పిటిషనర్ ట్రెజా జోసెఫిన్ కోర్టులో సవాల్ చేశారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా వివక్షాపూరితంగా ఉన్నదని, పని స్వభావం బట్టి మహిళలను ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. ట్రెజా జోసెఫిన్ ఇదే సంస్థలో గ్యాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ( సేఫ్టీ) గా పనిచేస్తున్నారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ సంస్థపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నోటిఫికేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని కోర్టు తెలిపింది. కర్మాగారాల చట్టం 1948 లోని నిబంధనలు మహిళలను కార్యాలయాల్లో దోపిడీ నుంచి రక్షించడానికి ఉద్దేశించినదని కోర్టు పేర్కొన్నది. “దరఖాస్తుదారు మహిళ అనే ప్రాతిపదికన కాకుండా అర్హతగల మరో అభ్యర్థిని నియమించడాన్ని నిరాకరించలేం. ఉద్యోగ స్వభావం ప్రకారం ఆమె రాత్రి వేళల్లో పని చేయాల్సి ఉంటుంది.
ప్రపంచం ముందుకు సాగుతున్నది. ఇటువంటి పరిస్థితిలో వారిని ఇంటి పనిలోనే ఎందుకు పరిమితం చేయాలి. ఆర్థికాభివృద్ధి రంగంలో మహిళల సహకారాన్ని విస్మరించలేని దశకు చేరుకున్నాం. హెల్త్‌కేర్, ఏవియేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు పలు పరిశ్రమల్లో మహిళలు అన్ని వేళలా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళలు.. తాము ఎలాంటి పనినైనా చేయగలుగుతామని నిరూపించారు అని కోర్టు వ్యాఖ్యానించింది. సంస్థ తీరును తప్పుపట్టిన హైకోర్టు.. గతంలో జారీచేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.
ఇవి కూడా చదవండి..
స్పేస్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన వ్యోమగామి కేట్ రూబిన్స్
నేపాల్‌లో వైభవంగా విషాల్ సింధూర్ జాతర
మేధోసంపత్తి అడ్డంకులు తొలగించండి.. బైడెన్‌కు ఎంపీల వినతి
రక్తం గడ్డకట్టకపోతే తీవ్ర ప్రమాదం.. చరిత్రలో ఈరోజు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
టీకా ఆఫర్ : రిబెట్ ఇస్తున్న దుబాయ్ హోటల్స్
జూన్ 1 నుంచి హాల్‌మార్క్ నగలే అమ్మాలి..
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

