ఆప్రికాట్ పండ్లతో ఆరోగ్యం
ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఆప్రికాట్ కూడా ఒకటి.

ఆరోగ్యాన్ని అందించే పండ్లలో ఆప్రికాట్ కూడా ఒకటి. ఇదొక డ్రైఫ్రూట్.. ఇతర డ్రైఫ్రూట్స్ తో పోలిస్తే దీనిలో క్యాలరీస్ తక్కువ. ఇవి సాధారణంగా నారింజ లేదా పసుపు రంగులో ఉంటూ కొద్దిగా ఎరుపురంగు జోడించుకుని ఉంటాయి.
వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, విటమిన్ ఈ, పొటాషియం, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్ వంటి ఖనిజాలు, విటమి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి తినవచ్చు లేదా పచ్చిగా అలాగే తీసుకోవచ్చు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను ఆప్రికాట్ అందిస్తుంది. ఈ పండ్లలో ఉన్న పొటాషియం రక్తపోటు స్థాయులను అదుపులో ఉంచుతుంది. అలాగే అధికంగా ఉండే ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది.
గుండెకు తోడ్పాటు

అథెరోస్క్లెరోసిస్ వంటి గుండె సంబంధిత వ్యాధులను, గుండె పోటును నివారిస్తుంది. గర్భిణికి ఎంతో అవసరమయ్యే ఇనుము ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. ఎర్ర రక్త కణాలను పెంచడంలో ఉత్తమంగా సాయపడుతుంది. వీటిలో లభించే ఇనుము మనకు రక్తహీనత రాకుండా చూస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతూ.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
జీర్ణక్రియ సవ్యంగా సాగేలా చేయడం, కొలెస్ట్రాల్ తగ్గిండం ద్వారా బరువు తగ్గడంలో సహాయం చేయడం, శ్వాసకోశ సంబంధ సమస్యల చికిత్సలో విశేషంగా సాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉండి మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది. ఈ పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపొరాసిస్) రాకుండా చేస్తుంది, ఎముకలుఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది

ఈ పండులో ఉండే విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఆస్తమా, జలుబు, ఫ్లూ లక్షణాలు ఆప్రికాట్ తినడం వల్ల తగ్గుతాయని పలు పరిశోధనల్లో తేలింది. చెవినొప్పికి ఆప్రికాట్ నూనె ఔషధంలా పనిచేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి.
ఈ పండులో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల వయసు వల్ల వచ్చే దృష్టి సంబంధ సమస్యలను దూరం చేసుకోవచ్చు. చర్మం ఆరోగ్యవంతంగా , మృధువుగా ఉండేలా ఆప్రికాట్ ప్రోత్సహిస్తాయి. వివిధ చర్మ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

అప్రికాట్లను, రసాలు, జెల్లీలు, జాములు వంటి వివిధ రకాల పద్దతులలో వాడుతుంటారు. ఎసెన్షియల్ నూనెలా కూడా వాడుతుంటారు. ఇవి కెరోటినాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలను కలిగి ఉండి క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి.
ఇవి కూడా చదవండి..
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్‌ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

