e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News కుట్టుపిండి ఆహారాలు తిన్న‌ 500 మందికి అస్వ‌స్థ‌త‌

కుట్టుపిండి ఆహారాలు తిన్న‌ 500 మందికి అస్వ‌స్థ‌త‌

కుట్టుపిండి ఆహారాలు తిన్న‌ 500 మందికి అస్వ‌స్థ‌త‌

న్యూఢిల్లీ: కుట్టు పిండితో (బ‌క్వీట్) త‌యారుచేసిన‌ ఫాస్ట్ ఫుడ్ తిన్న దాదాపు 500 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. క‌డుపులో నొప్పిగా ఉన్న‌దంటూ వీరు ఫిర్యాదు చేశారు. ఘ‌జియాబాద్‌లోని వివిధ ద‌వాఖాన‌ల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

తూర్పు ఢిల్లీలోని తూర్పు ఖిచ్డిపూర్, త్రిలోక్‌పురి, కళ్యాణపురి ప్రాంతాలలో కుట్టు పిండితో చేసిన పిండివంట‌లు తిన్న ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి నుంచి ఈ ఫిర్యాదులు ప్రారంభ‌మ‌య్యాయి. చాలా మంది స్థానిక‌ లాల్ బహదూర్ శాస్త్రి ద‌వాఖాన‌కు వచ్చారు. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ, పరిపాలన బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

తూర్పు ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి ద‌వాఖాన‌ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ మన్సుఖాని తెలిపిన వివ‌రాల ప్రకారం, కుట్టు పిండి కారణంగా వాంతులు, విరేచనాలు ఫిర్యాదు వ‌చ్చాయి. మంగళవారం రాత్రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 490 మంది వచ్చారు. వీరిలో ఇద్దరి ప‌రిస్థితి కొంచెం విష‌మించింది. మిగిలిన వారికి మందులు ఇచ్చి ఇంటికి పంపించారు.

మరోవైపు, ఘజియాబాద్‌లోని మోదీనగర్‌కు చెందిన సిక్రీ ఖుర్ద్, దాని చుట్టూ ప‌క్క‌ల‌ కాలనీల్లో నివసిస్తున్న చాలా మంది ఆరోగ్యం క్షీణించింది. గేటు దగ్గర ఉన్న దుకాణం నుంచి కుట్టు పిండి కొన్నట్లుగా చెప్తున్నారు. గ‌త ఏడాది కాలంగా ఇదే దుకాణదారుడు త‌మ‌కు కుట్టుపిండి ఇస్తున్నార‌ని, అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు రాలేద‌ని ఇక్క‌డి వారు చెప్తున్నారు. కుట్టుపిండి ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌టంతో పండుగుల సంద‌ర్భాల్లో స్థానికులు ఆతృత‌గా ఉండి న‌కిలీ పిండి గుర్తించ‌ర‌ని, అందుకే కుట్టుపిండిని క‌ల్లీ చేసి అమ్ముతుంటార‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు.

పాత, కల్తీ పిండి విషంగా మారి అనారోగ్యానికి గురి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి, కుట్టు పిండిని కుట్టు మొక్క విత్తనాల నుంచి తయారు చేస్తారు. పిండి ఒక నెల కన్నా ఎక్కువ నిల్వ ఉండ‌దు.ఈ పిండిని కొనడానికి ముందు కొన్ని విషయాలను తనిఖీ చేయడం ద్వారా ఇబ్బందుల‌ను దూరం చేసుకోవ‌చ్చంటున్నారు నిపుణులు.

పిండిలో నల్ల ధాన్యాలు వంటివి ఏదైనా ఉండటం, పిండిలో కరుకుదనం ఉండ‌టం, ప్యాకెట్ సీలు తెరిచి ఉండ‌టం, ప్యాకెట్‌ల‌ను పాత‌ వినియోగ తేదీల‌తో అమ్మ‌డం, పిండిలో రుచి లేక‌పోవ‌డం వంటివి గ‌మ‌నించి వాటిని వాడ‌కుండా చూసుకోవాల‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

సీబీఐ ఎదుట హాజ‌రైన అనిల్ దేశ్‌ముఖ్

మ‌హా దార్శ‌నికుడు భీంరావ్ అంబేడ్క‌ర్ : చ‌రిత్ర‌లో ఈరోజు

భార‌తీయుల‌కు నూత‌న సంవత్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన అమెరిక‌న్ సింగ‌ర్

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ ఇన్‌స్టాల్ చేయ‌కండి..!

టిబెట్ స‌రిహ‌ద్దుల్లో 5 జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న చైనా

రెండేండ్ల‌లో పెరిగిన‌ బంగారం దిగుమతి

టీకా వేసుకోండి.. ఎక్కువ వ‌డ్డీ పొందండి..!

జూన్ నుంచి నిలిచిపోనున్న‌ గూగుల్ మొబైల్ షాపింగ్‌ యాప్ సేవ‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుట్టుపిండి ఆహారాలు తిన్న‌ 500 మందికి అస్వ‌స్థ‌త‌

ట్రెండింగ్‌

Advertisement