ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయకండి..!
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారు అయితే, యాప్‌లను ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

న్యూ ఢిల్లీ: మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారు అయితే, యాప్‌లను ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కీ తన బ్లాగ్ పోస్ట్ లో అనధికారిక ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాం APKPure స్టోర్ గురించి జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేయడం ప్రమాదకరమని పేర్కొన్నది.
APKPure అనేది ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం ఒక యాప్ స్టోర్. దీని నుంచి ఉచిత షేర్‌వేర్ యాప్‌లు అందించబడతాయి. అయితే, అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కాస్పెర్స్కీ సిఫారసు చేస్తుంది.
కాస్పెర్స్కీ నివేదిక ప్రకారం, APKPure యాప్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదు. APKPure యాప్ యొక్క 3.17.18 వెర్షన్ ట్రోజన్ డ్రాప్పర్తో వస్తుంది. ఇది కాస్పెర్స్కీ సొల్యూషన్ ద్వారా గుర్తించబడింది. ఈ ట్రోజన్ మీ మొబైల్ ఫోన్‌కు చేరుకుంటే, అది మీ ఫోన్‌ను దెబ్బతీస్తుంది. మీ ఫోన్ లాక్ స్క్రీన్‌లో అనేక రకాల ప్రకటనలను ప్రదర్శిస్తుంది. అలాగే, ఓపెన్ బ్రౌజర్ మీ వ్యక్తిగత సమాచారాన్ని టాబ్ నుంచి దొంగిలిస్తుంది. ఇతర ప్రమాదకరమైన మాల్వేర్లను కూడా ఇంజెక్ట్ చేయవచ్చు.
APKPure అనువర్తనంలో అనేక ట్రోజన్లు కనుగొనబడినట్లు పరిశోధకులు చెప్తున్నారు. మీ స్మార్ట్‌ఫోన్ తాజా ఆండ్రాయిడ్‌కి మద్దతు ఇవ్వకపోతే, ఈ ప్రమాదకరమైన మాల్వేర్ మీ పరికరానికి హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, వినియోగదారులు ఆండ్రాయిడ్ 8, అంతకంటే ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ను నవీకరించడం ఉత్తమం. ఇది ఆండ్రాయిడ్ 6, 7, 8 వెర్షన్లతో పరికరాలను దెబ్బతీసే అవకాశం ఉన్నది.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ కార్డుల కోసం కేపిటల్ హిల్ వద్ద భారత వైద్యుల ఆందోళన
టిబెట్ సరిహద్దుల్లో 5 జీ నెట్వర్క్ విస్తరిస్తున్న చైనా
రెండేండ్లలో పెరిగిన బంగారం దిగుమతి
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
మధ్యప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత.. ఒకేరోజు నలుగురు మృతి
జలియన్ వాలా బాగ్ మారణకాండ.. బ్రిటిషర్ల దురాగతానికి 102 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

