ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోం : సుప్రీంకోర్టు
ఏ మతగ్రంథంలోనూ జోక్యం చేసుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది

న్యూఢిల్లీ : ఏ మతగ్రంథంలోనూ జోక్యం చేసుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఖురాన్ షరీఫ్ నుంచి 26 శ్లోకాలను తొలగించాలని లక్నోకు చెందిన వసీం రిజ్వి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా, పిటిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధించింది.
ఖురాన్‌లోని 26 శ్లోకాలను తొలగించాలని ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ శ్లోకాలను బోధించడం ద్వారా చాలా మంది విద్యార్థులు తప్పుదారి పట్టించారని, అందుకే ఖురాన్‌లోని శ్లోకాలను తొలగించాలని పిటిషనర్ వాదించాడు. పిటిషనర్ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏ మత గ్రంథంలోనూ జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. దీనితో పాటు అతడికి కోర్టు రూ.50 వేల జరిమానా కూడా విధించింది.
సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వసీం రిజ్వి పిటిషన్‌ను విచారించింది. విచారణ సందర్భంగా, పిటిషనర్ తరపు న్యాయవాది ఈ ఎస్ఎల్పీకి సంబంధించిన అన్ని వాస్తవాలు తనకు తెలుసునని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు ఈ ఎస్ఎల్పీ రిట్ కాదని పేర్కొన్నది. దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, ఈ శ్లోకాలను మదర్సాల్లో బోధిస్తూ విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. ఈ శ్లోకాలను బోధించడం, వివరించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులు తయారవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇది నిరాధారమైన పిటిషన్ అని పేర్కొంటూ.. పిటిషన్‌దారుకు రూ.50 వేల జరిమానా విధిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి..
సెనేట్‌లో మెజార్టీ సాధిద్దాం : డొనాల్డ్ ట్రంప్
తొలిసారిగా అంతరిక్షంలో కాలిడిన యూరి గగారిన్.. చరిత్రలో ఈరోజు
మూడు రాష్ట్రాల్లో కొవిడ్ చర్యల్లో లోపాలు : గుర్తించిన కేంద్ర బృందాలు
స్మగ్లర్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి
ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్
ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు
అమెరికాలో కరోనా మహమ్మారి నాలుగో వేవ్..?!
అక్రమ ఆయుధ మార్కెట్: గన్ కావాలా పెషావర్ రండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

