e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

న్యూయార్క్ : అమెరికా‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నాలుగో వేవ్ ప్రారంభం కానున్న‌దా..? గ‌తంలో క‌న్నా మ‌రింత ఎక్కువ‌గా ఇబ్బంది పెట్ట‌నున్న‌దా..? నాలుగో వేవ్ లో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌నున్నాయి అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అమెరికా అంత‌టా మరోసారి కొత్త రోగుల సంఖ్య పెరుగడం ప్రారంభమైంది.

శుక్రవారం ఒక్క‌రోజే కొత్తగా 85,368 మంది రోగులను గుర్తించారు. అలాగే, 929 మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు, ఫిబ్రవరి 19 న 80 వేలకు పైగా కొత్త రోగులు న‌మోద‌య్యారు. గత ఒక వారంలో ప్రతిరోజూ సగటున 64,760 కేసులు నమోదవుతున్నాయి. ఇవి గత రెండు వారాలతో పోలిస్తే 21 శాతం ఎక్కువ.

అమెరికా అంతటా కొత్త రోగులు పెరుగడం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది కొత్త వైవ్‌ ముప్పును కలిగిస్తుంద‌ని వారు భ‌య‌ప‌డుతున్నారు. కొత్త కేసులను తగ్గించడం అంటే అంటువ్యాధి పోయిందని ప్రజలు, ప్రభుత్వం అనుకోకూడద‌ని వారు చెప్తున్నారు. నిర్లక్ష్యం కొత్త వేవ్‌కు దారితీస్తుందని, ఫ‌లితంగా పెద్ద సంఖ్య‌లో కొత్త రోగుల న‌మోదు జ‌రుగుతుంద‌ని గుర్తుంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఈ సమయంలో యువత ఎక్కువగా ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతున్నారు.

11 మిలియన్ల మందికి పైగా టీకాలు

అమెరికా తన ప్రజలకు వ్యాక్సిన్‌ను వేగంగా అందిస్తున్న‌ది. ఇప్పటివరకు దేశంలో 34 శాతం జనాభాకు మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే 11 కోట్లకు పైగా మందికి టీకాలు వేశారు. ఏదేమైనా, అమెరికాలోని కరోనా ధోరణిలో క‌నిపిస్తున్న మంచి విషయం ఏంటంటే.. మరణాలు మునుపటి కంటే చాలా తక్కువగా న‌మోద‌వ‌డం. టీకాలు తీసుకోక‌పోవ‌డం, మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌కుండా య‌ధేచ్చ‌గా ఉండ‌టం వ‌ల్ల క‌రోనా నాలుగో వేవ్ వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెప్తున్నారు. నాలుగో వేవ్ వ‌ల్ల మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు.

కరోనా మరణాల వెనుక టీకాలు వేయడం ఇప్పుడు ఒక ప్రధాన కారణమని సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోసెల్లె వాలెన్స్కీ అన్నారు. అందుక‌ని టీకాలను మరింత వేగంగా అందించాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. దీని కోసం ప్రజలను ప్రేరేపించాల్సిన అవ‌స‌ర‌మున్న‌ద‌న్నారు.

ఇబ్బందికరమైన స్థాయిలో కొత్త కేసులు: ఫౌసీ

పెరుగుతున్న కొత్త కేసులు ఇబ్బందికరమైన స్థాయికి చేరుకున్నాయని అమెరికా ప్ర‌ముఖ‌ అంటువ్యాధి నిపుణుడు ఆంథోనీ ఫౌసి అన్నారు. కరోనా కొత్త వేవ్‌ల‌ ప్రమాదంతో అమెరికా మళ్లీ ప్రమాదంలో ఉన్న‌ద‌ని, ప్రజలలో వ్యాక్సిన్ పొందడం అవ‌స‌ర‌మ‌నే అవ‌గాహ‌న రావాల‌ని ఆయ‌న తెలిపారు.

ఇవి కూడా చదవండి..

అక్రమ ఆయుధ మార్కెట్: గ‌న్ కావాలా పెషావ‌ర్ రండి..!

వివాదాల్లో జో బైడెన్ కుమారుడు

బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు

డైనోసార్ల క‌లిసి తిరిగిన ఉడుమును క‌నుగొన్న శాస్త్ర‌వేత్త‌లు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బ‌య‌ల్దేరిన ముగ్గురు వ్యోమ‌గాములు

గిన్నిస్‌ రికార్డు గోర్లు.. 30 ఏండ్ల తర్వాత కత్తిరింపు

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

వావ్‌..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!

ఆరోగ్యంగా ఉంటేనే ధనవంతులం..

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

ట్రెండింగ్‌

Advertisement