Wife Husband | సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య అనుమానాస్పద స్థితిలో హత్యగావించబడగా.. ఆమె భర్త పరిస్థితి విషమం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్ కుమార్, మీనా దేవి(35) దంపతులు శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం IDA బొల్లారం మీదుగా బైక్‌పై వెళ్తుండగా.. IDA బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద సడెన్‌గా బైక్ ఆగిపోయింది. అదే సమయంలో దుండగులు పొదల్లోంచి వచ్చి భార్య మీనా దేవి(35)ని పొదల్లోకి లాక్కెళ్లారు.
అడ్డుకున్న భర్త అనిల్ కుమార్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతని ముందే భార్య మీనా దేవి గొంతు కోసి హత్య చేశారు. తీవ్రగాయాలతో ఉన్న అనిల్ కుమార్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నబొల్లారం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Naga Chaitanya | నీతో జీవితాన్ని పంచుకోవడం నా అదృష్టం.. శోభిత బర్త్‌డేపై నాగచైతన్య ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu | ఎప్పటికీ మీరే నా హీరో నాన్న .. కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్‌బాబు ఎమోషనల్ పోస్ట్
ముగ్గురు స్నేహితులను కాపాడి కాపాడి ఆ పై తాను మృతి చెంది..అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి