చెరుకు సాగు పెంచండి: సీఎస్
రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణం పెంచడం, చకెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చెరకు పంట విస్తీర్ణం పెంచడం, చకెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. చెరుకు సాగు, దాని ఉత్పత్తుల పెంపుపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 12 చకెర కర్మాగారాలు ఉండగా, ప్రస్తుతం 7 కర్మాగారాలు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఆ పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే ఏటా సుమారు 50 లక్షల టన్నుల చెరుకు అవసరమవుతుందని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 20 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. చెరుకు సాగు పెంచేందుకు, పరిశ్రమలకు అవసరమైన ముడి చెరుకు లభ్యతను మెరుగుపరచేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ చెరుకు రైతులకు కూడా వరి రైతులకు అందిస్తున్న తరహాలో టన్నుకు రూ.500 ప్రోత్సాహకం అందించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

