e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home News కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

మనం సాధారణంగా తాజాదనం కోసం కాఫీ తాగుతాం. అయితే, అనేక వ్యాధులతో పోరాడటంలో కూడా కాఫీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మనకు తెలియదు. చాలా మంది తమ రోజును ఉదయం కాఫీతో శక్తి కోసం ప్రారంభిస్తారు. ఇదే సమయంలో అధిక మోతాదులో తీసుకుంటే కాఫీ హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

బ్రిటన్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో.. కాఫీ తాగేవారిలో వయసు సుమారు 10 సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. ఈ అధ్యయనం సుమారు ఐదు లక్షల మందిపై నిర్వహించారు. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే భయపడాల్సిన అవసరం లేదు. కానీ, అదే ఐదారు కప్పులకు మించితే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.

కాఫీ తాగని వారికంటే కాఫీ తాగేవారికి ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందని టఫ్ట్స్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూట్రిషన్ నిపుణుడు ఆలిస్ లిచ్సెంటైన్ వెల్లడించారు. అయితే, కాఫీ తాగడం వల్ల జీవిత కాలం ఎందుకు పెరుగుతుందో ఇంకా తెలియదని యూఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుడు ఎరికా లోఫ్ట్‌ఫీల్డ్ అంటున్నారు.

సంతోషంగా ఉంచుతుంది.

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

కాఫీలో వెయ్యికి పైగా రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని రక్షించడంతో పాటు మనల్ని సంతోషంగా ఉంచడానికి సహాయపడతాయి.

కాఫీ తాగడం ద్వారా డయాబెటిస్‌ను నివారించవచ్చని మరో అధ్యయనం కనుగొన్నది. కాఫీ తాగడం ద్వారా శరీరం ఇన్సులిన్‌ను సరిగా ఉపయోగించుకుంటుందని తేల్చారు. కానీ కాఫీకి అదనపు కొవ్వు లేదా క్యాలరీలు జోడించడం హానికరమని వారు సెలవిచ్చారు.

యూఎస్‌ నేషనల్ క్యాన్సర్ స్కూల్‌ పరిశోధకుడు ఎరికా లోఫ్ట్‌ఫీల్డ్ కాఫీపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం, 24 గంటల్లో 5 కప్పుల వరకు అంటే 400 మి.గ్రా కాఫీ తాగితే అప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయని తేల్చారు.

క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

యుఎస్, యూరప్, జపాన్లలో పరిశోధకులు కాఫీపై 16 అధ్యయనాలు చేపట్టగా.. ఇందులో 10 లక్షల మంది పాల్గొన్నారు. ఇందులో 57 వేల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు ఉన్నారు.

పరిశోధకులు ఎక్కువ కాఫీ తాగేవారిని తక్కువ కాఫీ తాగే వారితో పోల్చారు. ఎక్కువ కాఫీ తాగేవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 12 శాతం తగ్గిందని కనుగొన్నారు. వీరిలో 20 శాతం మంది కూడా బరువు కోల్పోయారు.

కొన్నేండ్లుగా కాఫీ క్యాన్సర్‌కు కారణమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాని, 2015 లో అమెరికన్ అడ్వైజరీ కమిటీ ఆహారం విషయంలో ఒక మార్గదర్శకాన్ని రూపొందించింది. అప్పటినుంచి కాఫీ యొక్క సాధారణ వాడకాన్ని ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా పరిగణించారు.

రోజులో 6 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 22 శాతం పెరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది.

ఆత్రుతలో తాగితే యాసిడ్‌ వస్తుంది..

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

జామా ఇంటర్నల్ మెడిసిన్‌ యూకేలోని 5 మిలియన్ల మంది కాఫీ అలవాటును అధ్యయనం చేశారు. వివిధ మార్గాల్లో కాఫీ తాగడం వల్ల ప్రజలకు పెద్ద తేడా లేదని తేలింది. కాని త్వరగా కాఫీ తాగే అలవాటు ప్రజల్లో ఎక్కువ ఆమ్ల నిర్మాణాన్ని చూపించింది. వివిధ మార్గాల్లో తయారుచేసిన కాఫీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గినట్లు గుర్తించారు.

కాఫీ నిత్యం తీసుకోవడం వల్ల లాభాలు..

10 ఏండ్ల వయసును పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.

వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవచ్చు.

టైప్‌ -2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి మంచి పానీయం

మనం సంతోషంగా ఉండేందుకు వీటిలోని యాంటీ యాక్సిడెంట్స్‌ ఉపయోగపడతాయి

చర్మ, ప్రొస్టేట్‌ వంటి క్యాన్సర్లు రాకుండా కాపాడుతాయి.

కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేందుకు సహాయపడుతుంది.

శరీరం బరువు తగ్గించుకోవడానికి మంచి సాధనం.

కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది.

నిద్రలేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మతిమరుపు సమస్యల నుంచి దూరం చేస్తుంది.

ఫిజికల్‌ యాక్టివిటీ పెరిగేందుకు దోహదపడుతుంది.

6 కప్పుల కన్నా ఎక్కువ తీసుకుంటే నష్టాలు..

ఆకలి మందగించేలా చేస్తుంది.

నిద్ర లేమి సమస్యలను కలిగిస్తుంది.

జీర్ణ సమస్యలు కనిపిస్తాయి.

ఒత్తిడి పెరుగుతుంది.

ఎసిడిటీ సమస్యలు వేధిస్తుంది.

ఇవి కూడా చదవండి..

భారత్‌లోని 3 నగరాల్లో షోరూంలు తెరుస్తున్న టెస్లా

ట్రైనీ ఎయిర్‌హోస్టెస్‌కు ఇంటర్‌ విద్యార్థి వేధిపులు.. ఐదు గంటల్లోనే పట్టివేత

వీడియో వైరల్‌:‌ పనివాడితో గున్న ఏనుగు సరదా పోట్లాట..! గెలుపెవరిదంటే..?

భారత్‌పై సైబర్ దాడులు చేసే సామర్థ్యం చైనాకుంది: సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌

రేపు భారత్‌, చైనా మధ్య 11 వ రౌండ్‌ చర్చలు

జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్

కరోనా సెకండ్‌ వేవ్‌ : కొత్తగా మూడు లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు..

బ్రిటిష్‌ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌.. చరిత్రలో ఈరోజు

వావ్‌..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!

ఆరోగ్యంగా ఉంటేనే ధనవంతులం..

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement