e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home News బ్రిటిష్‌ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌.. చరిత్రలో ఈరోజు

బ్రిటిష్‌ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌.. చరిత్రలో ఈరోజు

బ్రిటిష్‌ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌.. చరిత్రలో ఈరోజు

ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో ‘ప్రజా భద్రత బిల్లు’ను బ్రిటిష్‌ వైస్రాయ్‌ ప్రవేశపెట్టారు. ఇక్కడ బిల్లు చట్టంగా మారింది. గ్యాలరీ మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది. బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే సభలో ఒక్కసారిగా దిక్కులదిరేలా పెద్ద శబ్దం వచ్చింది. ఇద్దరు వ్యక్తులు అసెంబ్లీ మధ్యలో బాంబు విసిరి.. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినదిస్తూ కొన్ని కరపత్రాలను సభలోకి విసిరారు. ‘చెవిటి చెవులు వినడానికి పేలుళ్లు అవసరం’ అని కరపత్రాల్లో రాశారు.

ఈ బాంబులను భరతమాత ముద్దుబిడ్డలు భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ విసిరారు. బాంబులు విసిరేటప్పుడు ఎవరి ప్రాణానికి హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం భవనంలో గందరగోళం నెలకొని అందులో ఉన్నవారు బయట పరుగెత్తటం ప్రారంభించారు.

అయితే బాంబులు విసిరిన విప్లవకారులు మాత్రం అక్కడ నిలబడి ఉన్నారు. అనంతరం అధికారులు వారిద్దర్ని పోలీసులకు అప్పగించారు. ఈ బాంబులు విసిరన ఘటన జరిగి నేటికి సరిగ్గా 88 సంవత్సరాలు పూర్తయ్యాయి.

అసెంబ్లీ బాంబు దాడుల్లో భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ దోషులుగా తేలారు. ఇద్దరికీ జీవిత ఖైదు విధించి బటుకేశ్వర్ దత్‌ను కాలాపాణి జైలుకు పంపారు. సాండర్స్‌ను చంపిన కేసులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను దోషులుగా నిర్ధారించి 1931 మార్చి 23 న ఉరి తీశారు.

మంగళ్‌ పాండే ఉరితీత

బ్రిటిష్‌ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌.. చరిత్రలో ఈరోజు

స్వాతంత్ర సమరయోధుడు మంగళ్‌ పాండేను 1857 లో సరిగ్గా ఇదే రోజున ఉరితీశారు. అతను బ్రిటిష్ ఇండియాకు చెందిన బరాక్‌పూర్ రెజిమెంట్ సైనికుడు. 1857 యుద్ధం తిరుగుబాటులో మంగళ్‌ పాండే, అతని సహచరులు ముఖ్యమైన పాత్ర పోషించారు. అతను ఇంగ్లిష్ అధికారులను కాల్చడం, దాడి చేయడం, చంపినందుకు దోషిగా నిర్ధారించబడి ఉరితీతకు గురయ్యాడు.

సుమారు రెండుశతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్‌ పాండే. అప్పటివరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే.

మంగళ్‌ పాండే ఉత్తరప్రదేశ్‌ బల్లియా జిల్లాలోని నగ్వా గ్రామంలో జన్మించారు. అయితే, ఏ సంవత్సరంలో జన్మించారనే ఆధారాలు లేవు. 1849 లో బెంగాల్ ఆర్మీలో చేరారు. బ్రిటిష్‌ అధికారుల అరాచకాలను చూస్తూ మిన్నకుండకుండా వారికి ఎదురుతిరిగారు.

బ్రిటిషు సైన్యం మంగళ్‌ పాండేను హతమార్చి తిరుగుబాటును అణచివేయాలని చూసింది. కానీ అతను చనిపోయినా అతను రగిల్చిన తిరుగుబాటు జ్వాలలు చల్లారలేదు. మరింతగా భగ్గుమన్నాయి. బ్రిటిష్‌ సైన్యం అణచివేతను మరింత కఠినంగా అమలు జరిపింది. ఆ పోరాటంలో మూడు వేల మందికి పైగా దేశభక్తులను ఉరితీశారు. వేలాదిమందిని కాల్చిచంపారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు :

2013 : బ్రిటిష్ తొలి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ కన్నుమూత

2005: పోప్ జాన్ పాల్ II మరణం

1983 : టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్‌ జననం

1973: స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో ఫ్రాన్స్‌లో మరణం

1938: ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ జననం

1924: శాస్త్రీయ సంగీత గాయకుడు కుమార్ గాంధర్వ జననం

1894: వందే మాతరం గీత రచయిత, నవలా రచయిత బంకీమ్ చంద్ర చటోపాధ్యాయ కన్నుమూత

1859: జర్మన్ తత్వవేత్త, ఫినాలజీ పితామహుడు ఎడ్మండ్ హుస్సేల్ జననం

1820: గ్రీస్‌లోని ఎజిమ్‌ సముద్రంసమీపంలో కనుగొన్న ప్రపంచంలోని ప్రసిద్ధ శిల్పాలలో ఒకటైన వీనస్ డి మెల్లో

ఇవి కూడా చదవండి..

కొవిడ్‌కు గురైనవారిలో నాడీ, మానసిక రుగ్మతలు

ఏసీలు, ఎల్‌ఈడీ లైట్ల కోసం పీఎల్‌ఐ పథకం

వావ్‌..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!

సరిహద్దులో చొరబాటుదారు హతం.. భారీగా మందుగుండు స్వాధీనం

పరంబీర్‌సింగ్‌తో వాజ్‌ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్‌ నివేదిక

జవాన్‌ రాజేశ్వర్‌ విడుదలకు చర్చలు షురూ!

ఆరోగ్యంగా ఉంటేనే ధనవంతులం..

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
బ్రిటిష్‌ అసెంబ్లీలో బాంబులు వేసిన భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌.. చరిత్రలో ఈరోజు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement