e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home News మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి. ఆ ఆలోచనే కష్టంగా అనిపిస్తున్నది కదూ! సృష్టిలోని ప్రతి రంగుకూ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి. దాని వల్లే ప్రపంచం మన కళ్లకి మరింత అందంగా కనిపిస్తున్నది. మనపై కూడా ఈ రంగుల ప్రభావం ఉంటుందని తెలుసా? ఒక్కో రంగు.. ఒక్కో భావోద్వేగాన్ని పలికిస్తుంది. ఒక్కో రంగు.. మనుషులతో మమేకమైపోతుంది.

మన నిత్య జీవితంలో మన చుట్టూనే ఉంటూ మనకి తెలియకుండా మనపై అత్యంత ప్రభావాన్ని చూపించేవి కలర్స్. ఎన్నో వేల ఏళ్ల క్రితమే సృష్టిలో ఉన్న అనేక రంగులు మానవుడిపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకున్నారు.

ర‌క‌ర‌కాల రంగులు మ‌న నిత్యజీవితంలో భాగ‌మ‌య్యాయి. అన్ని ర‌కాల రంగులు మ‌న రంగును ఇట్టే ప‌ట్టేస్తాయి. మ‌న రంగేంటో బ‌య‌ట‌పెడ‌తాయి.

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

ఎరుపు రంగు.. అన్ని రంగుల్లోకెల్లా స్పష్టంగా కనిపిస్తుంది. భావోద్వేగాల మీద ఎరుపు రంగు చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మనుషుల్లో జీవక్రియను, శ్వాసవేగాన్ని, రక్తపోటును పెంచుతుంది.

పచ్చ రంగు.. ఇది ఎరుపు రంగుకు వ్యతిరేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. ప్రశాంతతను తీసుకువస్తుంది.

తెలుపు రంగు.. ఈ రంగును తరచూ వెలుతురుకు, భద్రతకు, పరిశుభ్రతకు ప్రతీకగా ఉపయోగిస్తారు. మంచితనం, నిర్దోషత్వం, స్వచ్ఛత వంటి లక్షణాలను సూచించడానికి కూడా వాడతారు.

నారింజ రంగు.. మ‌న‌లో మానసిక సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ఈ రంగు మ‌న‌లో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది.

పసుపు రంగు.. మెదడు విడుదల చేసే సెరోటోనిన్ అనే కెమికల్‌ మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు.. మన జీర్ణవ్యవస్థ బాగుపడేందుకు కూడా ఈ రంగు తోడ్పడుతుంది.

ఆకుప‌చ్చ రంగు.. ప్రకృతికి చిహ్నం ఈ రంగు. మీ దృష్టికోణాన్ని మార్చే రంగు కూడా. ఆఫీసులో మీకు ప్రశాంతంగా అనిపించకపోతే ఈ రంగు చుట్టు పక్కల ఉండేలా చూసుకోండి. దీనివల్ల చేసే పనిలో సంతృప్తి చెందడమే కాదు, ఒత్తిడి కూడా మాయమవుతుంది.

నలుపు రంగు.. మనలోని శక్తి, అధికారాన్ని నిద్ర లేపుతుంది. ఎవ్వరినైనా అందంగా చూపించడంలో మొదటిస్థానం కూడా ఈ రంగుకే దక్కుతుంది.

నీలం రంగు… మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అలాగే ఆకలిని తగ్గించే పనిలో కూడా ఈ రంగు ముందుంటుంది.

గులాబీ రంగు.. ఒత్తిడిని, ఆత్రుతను తగ్గించే రంగుగా దీనికి పేరుంది. పైగా ఆడవాళ్లకు బాగా నచ్చే రంగు. కోపంలో ఉన్నప్పుడు ఈ రంగును ఒక్కసారి చూస్తే చాలు.. కోపం పటాపంచలవుతుంది.

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

మ‌నం నివసించే ఇంటికి వేసే రంగులు మన‌ ప్రవర్తన, ఆలోచనాస‌ర‌ళి, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయని చైనా వాస్తుశాస్త్రం ఫెంగ్‌షుయ్ చెప్దితోం. ఇంటికి మనం వాడే రంగులను బట్టి శుభ, అశుభ ఫలితాలుంటాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. రంగులు పిల్లల మనస్సుల పైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల్లో హుషార్ తీరుకురావాలన్న, హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలను కుదురుగా ఉంచాలన్నా.. రంగుల వల్లే సాధ్యం అవుతుందంటున్నారు. పిల్లల బెడ్ రూమ్స్ కి వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

జీవితాన్ని ఆస్వాదించేలా సృష్టే ప్రేమతో ఇన్ని రంగుల్ని చూసే సామర్థ్యాన్ని మనకు కానుకగా ఇచ్చింది. రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవ‌డ‌మే క‌ష్టంగా ఉన్నప్పుడు రంగుల ప్రపంచంతో జీవితాన్ని మ‌మేకం చేసి హాయిగా, ఆనందంగా గ‌డుపాలి. రంగుల‌కూ ప్రాధాన్యం ఇవ్వండి.. జీవితాన్ని రంగులమ‌యం చేసుకోండి.

ఇవి కూడా చదవండి..

బొగ్గు కుంభకోణం కేసుల విచారణకు న్యాయమూర్తులను నియమించిన సుప్రీంకోర్టు

ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను అమ్మేసిన దుర్మార్గుడు

వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్‌ జంట

ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం

అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

ఫాల్కే అవార్డును దోస్త్‌ రాజ్‌ బహదూర్‌కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్

ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement