e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

ఆడ వారి నుంచి అండం.. మగ వారి నుంచి శుక్ర కణం కలిస్తేనే మానవ పిండం తయారవుతుందని మనకందరకు తెలుసు. అయితే, ఇవేవీ అవసరంలేకుండానే కేవలం చర్మ కణాల నుంచి ప్రయోగశాలలో మానవ పిండాన్ని తయారు చేసి చూపించారు శాస్త్రవేత్తలు.

త్వరలోనే సాధారణ కణాలను ఉపయోగించి మానవ శుక్ర కణం, అండాలను సృష్టించగలిగారు. ఇది వైద్య పరిశోధనల్లో, మానవ పిండాల వృద్ధిలో గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ పరిధోళనలు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నవారికి శుభవార్తను అందిస్తుండగా.. ఇదే సమయంలో ఇబ్బంది కలిగించే అనేక నైతిక ప్రశ్నలను లేవనెత్తుతున్నది.

నలభై సంవత్సరాల క్రితం వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలకు మొదటి ‘టెస్ట్-ట్యూబ్ బేబీ’ లూయిస్ బ్రౌన్ జన్మించారు. ఐవీఎఫ్ చేత ఇప్పుడు లక్షల మంది పిల్లలు జన్మించినప్పటికీ.. జన్యుపరంగా వారి బిడ్డను కలిగి ఉండటానికి ఆసక్తి ఉన్న జంటలకు ఈ సాంకేతికత ఎలాంటి సహాయం చేయదు. అయితే, శుక్ర కణాలు ఉత్పత్తి కాని పురుషులు, అండాశయ క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స చేసుకున్న మహిళలు., ఇప్పుడు వాటి అవసరం లేకుండానే మానవ పిండాన్ని తయారు చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.

కొందరు దాతల అండాలు లేదా శుక్ర కణాల కోసం శోధిస్తుంటారు. ఇలాంటి వారికి ప్రత్యామ్నాయం మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ అండాలు, శుక్ర కణాలను సృష్టించే దిశగా- ఫలదీకరణంలో కలిపే గామేట్స్ అని పిలవబడే వాటిని-కృత్రిమంగా పెట్రీ డిష్‌లో తయారుచేయడంలో శాస్త్రవేత్తలు స్థిరమైన పురోగతి సాధిస్తున్నారు.

పెట్రీ డిష్‌లో బ్లాస్టోసిస్ట్‌..

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

వాస్తవానికి అండంతో శుక్ర కణం కలిసిన కొద్ది రోజుల తరువాత మొదట బ్లాస్టోసిస్ట్ లేదా బ్లాస్టోయిడ్ ఏర్పడతాయి. ఈ బ్లాస్టోసిస్ట్ వెళ్లి గర్భాశయం గోడకు అంటుకుంటుంది. కొన్ని రోజుల తరువాత పిండం ఏర్పడుతుంది. అయితే, వీటి అవసరం లేకుండానే మానవ పిండం యొక్క ప్రారంభ నిర్మాణమైన బ్లాస్టోసిస్ట్‌ను అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన రెండు గ్రూపులు తయారు చేశాయి. అది కూడా గర్భాశయంలో కాకుండా ప్రయోగశాల పెట్రీ డిష్‌లో.

పెట్రీ డిష్ ఒక చిన్న గాజు పలక. దీనిలో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తుంటారు. పెట్రీ డిష్‌లో ఉన్న ఈ బ్లాస్టోసిస్ట్ గర్భాశయ గోడకు అతుక్కునేటప్పుడు సరిగ్గా ప్రవర్తిస్తుంది. నిజమైన బ్లాస్టోసిస్ట్‌ల మాదిరిగా అవి నాలుగైదు రోజులు పెరగడానికి అనుమతించినప్పుడు.. అవి కూడా మావి, ప్రీ అమ్నియోటిక్ కుహరం వంటి పిండంగా మారడం ప్రారంభించాయి. మావి అనేది గొట్టం, దీని ద్వారా పిండం తల్లి రక్తం నుంచి పోషణ, ఆక్సిజన్ పొందుతుంది.

అడ్డంకిగా మార్గదర్శకాలు..

అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన

శాస్త్రవేత్తలు ఎలాంటి పరిశోధనలకైనా మానవ పిండాలను పొందడం చాలా కష్టం. వాస్తవానికి మానవ పిండానికి సంబంధించి ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ చట్టాలు చాలా చట్టపరమైన, నైతిక అవరోధాలుగా ఉన్నాయి.

శాస్త్రవేత్తలు ఇంతకంటే ఎక్కువ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ స్టెమ్ సెల్ రీసెర్చ్ (ఐఎస్‌ఎస్‌సీఆర్‌) మార్గదర్శకాల ప్రకారం, ప్రయోగశాలలో ఫలదీకరణం జరిగిన 14 రోజుల వరకు ఏదైనా మానవ పిండంపై ప్రయోగాలు చేయవచ్చు. ఈ నియమం కారణంగా శాస్త్రవేత్తలు కేవలం 5 రోజుల తర్వాత పరిశోధనలను నిలిపివేశారు. నిబంధనల పరిమితుల్లోనే ఉన్నామని తెలిపేందుకే ఇలా పరిశోధనలను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్తున్నారు పరిశోధక శాస్త్రవేత్తలు.

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలకు మోనాష్ విశ్వవిద్యాలయం బయోమెడిసిన్ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్, ఆస్ట్రేలియన్ రీజెనరేటివ్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ మోనాష్ నాయకత్వం వహించారు. అదే సమయంలో, అమెరికన్ శాస్త్రవేత్తలు టెక్సాస్ విశ్వవిద్యాలయం నైరుతి వైద్య కేంద్రానికి చెందిన ప్రొఫెసర్ లైకియన్ యుతో కలిసి పనిచేశారు.

ఇవి కూడా చదవండి..

ఫాల్కే అవార్డును దోస్త్‌ రాజ్‌ బహదూర్‌కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్

రైతులకు మద్దతు తెలిపినందుకే కేంద్రం మమ్మల్ని శిక్షిస్తోంది: కేజ్రీవాల్

స్టాండప్ ఇండియా పథకానికి రూ.25,586 కోట్లు మంజూరు

ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి

లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్‌.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి

బిల్‌గేట్స్‌.. మైక్రోసాఫ్ట్‌.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్‌.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి త‌ర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్‌ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement