ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తూర్పు ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు

జకర్తా : తూర్పు ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 23 మంది మృతి చెందినట్లు సమాచారం. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని విపత్తు నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది.
అర్ధరాత్రి దాటిన తర్వాత కొండల నుంచి పెద్ద ఎత్తున బురద జారడంతో తూర్పు నుసా తెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలోని లామెనెలే గ్రామంలో దాదాపు 50 ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు 20 మృతదేహాలను గుర్తించగా.. తొమ్మిది మంది గాయపడినట్లు జాతీయ విపత్తు నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధి రాదిత్య జాతి తెలిపారు.

ఓయాంగ్ బయాంగ్ గ్రామంలో వరదలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామస్తులలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో గ్రామమైన వైబురక్‌లో రాత్రిపూట కురిసిన వర్షాలకు నదులు ఒడ్డును చీల్చుకుని తూర్పు ఫ్లోర్స్ జిల్లాలోని ప్రాంతాలకు బురదనీరు ప్రవహించడంతో ఇద్దరు గాయపడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వందలాది మంది ప్రజలు మునిగిపోయిన ఇండ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వారిలో కొందరు వరదలకు కొట్టుకుపోయినట్లు సమాచారం.
వందలాది మంది ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విద్యుత్ కోతలు, విరిగిపోయిన రోడ్లు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన జలాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులకు ఇబ్బందిగా ఉన్నది.
విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు, సైనిక సిబ్బంది ముంపు గ్రామాల ప్రజలను ఆశ్రయాలకు తరలిస్తున్నారు.పొరుగున ఉన్న ప్రావిన్స్ వెస్ట్ నుసా తెంగ్గారాలోని బీమాలో కూడా తీవ్రమైన వరదలు సంభవించాయి. ఇక్కడ దాదాపు 10,000 మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని రాదిత్య జాతి తెలిపారు.
కాలానుగుణ వర్షాలు ఇండోనేషియాలో ప్రతి ఏటా కొండచరియలు, వరదలకు కారణమవుతున్నాయి. 17,000 ద్వీపాల గొలుసుకట్టుగా ఉండే ఇండోనేషియాలో మిలియన్ల మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో లేదా సారవంతమైన వరద మైదానాలకు సమీపంలో నివసిస్తున్నారు. పశ్చిమ జావా ప్రావిన్స్‌లో జనవరిలో రెండు కొండచరియలు విరిగిపడి 40 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి..
లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

