లాంకో ప్రాజెక్టులో కూలిన బాయిలర్.. సురక్షితంగా బయటపడిన 16 మంది కార్మికులు
లాంకోకు చెందిన పవర్ కార్పొరేషన్ ప్రాజెక్టులో బాయిలర్ కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికులు బాయిలర్ కింద చిక్కుకుపోయారు

సోన్‌భద్రా : లాంకోకు చెందిన పవర్ కార్పొరేషన్ ప్రాజెక్టులో బాయిలర్ కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న 16 మంది కార్మికులు బాయిలర్ కింద చిక్కుకుపోయారు. వారిని సీఐఎస్ఎఫ్, ఇతర అధికారులు రక్షించి చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్భద్రాలో లాంకో సంస్థకు 1200 మెగావాట్ల అన్పారా ‘సీ’ లాంకో థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నది. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా బాయిలర్ కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పనిచేస్తున్న 16 మంది కార్మికులు బాయిలర్ కింద చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి ఇతర కార్మికుల సహాయంతో కూలీలందరినీ రక్షించారు. ఈ ఘటనలో 13 మంది కార్మికులు గాయపడ్డారు. వీరీలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న నెహ్రూ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద వార్త తెలియగానే కార్మికులు, వారి కుటుంబాలంతా యూనిట్ వెలుపల గుమిగూడారు. ప్రాజెక్ట్ పరిధిలోని ప్రమాద స్థలానికి వెళ్లేందుకు పట్టుబట్టారు. పోలీసులు వారిని నిలువరించడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నది. ఆందోళనకు దిగిన కార్మికులతో పోలీసు సూపరింటెండెంట్ అమరేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడి వారిని శాంతపరిచారు. కార్మికుల చికిత్స కోసం తీసుకోవాల్సిన చర్యలపై దగ్గరుండి మరీ అధికారులను పురమాయించారు.

సంస్థలో పనిచేస్తున్న కార్మికులు అందించిన సమాచారం ప్రకారం, 1200 మెగావాట్ల అన్పారా ‘సీ’ లాంకో ప్రాజెక్టులో 600 మెగావాట్ల యూనిట్ నంబర్ 2 బాయిలర్ నిర్వహణ కోసం 80 మీటర్ల ఎత్తులో కార్మికులు పనిచేస్తున్నారు. ఇంతలో బాయిలర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఆ సయమంలో అక్కడ 16 మంది పనిచేస్తున్నారు.
వారినందరినీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్షించారని కార్మికులు తెలిపారు. గంట పాటు ప్రయత్నించిన తరువాత కార్మికులందరినీ బయటకు తీసి చికిత్స అందించేందుకు స్థానిక నెహ్రూ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని కార్మికులు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఉత్తరాఖండ్‌లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
బిల్‌గేట్స్.. మైక్రోసాఫ్ట్.. పరిచయం అక్కర్లేని పేర్లు.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

