కాలిఫోర్నియా: కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో అన్ని పనులు, కార్యక్రమాలు, సమావేశాలు వర్చువల్‌గానే జరుగుతున్నాయి. ఒకరికి ఒకరు ముట్టుకోవడం చేయకుండా ఉండేందుకు ఈ వర్చువల్ విధానం చాలా ఉపయుక్తంగా ఉంటున్నది.
అయితే, కాలిఫోర్నియాకు చెందిన ఒక జంట తమ వివాహం చాలా ఆధునికమైనదిగా చెప్పుకోవడానికి గొప్ప ఆలోచనతో ముందుకొచ్చారు. రెబెక్కా రోజ్, పీటర్ కాచెర్గిన్స్కీ అమెరికన్ క్రిప్టోకరెన్సీ మార్పిడి వేదిక అయిన కాయిన్‌బేస్‌లో పనిచేస్తున్నారు. వీరికి మార్చి 14 న వివాహం జరిగింది.
వారి వివాహంలో ఒకరినొకరు వేళ్ళకు ఉంగరాలను తొడిగే బదులుగా.. వారు ‘డిజిటల్ ఉంగరాల’ ను ఎన్ఎఫ్టీ రూపంలో మార్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తమ ప్రేమకు సాక్ష్యమిచ్చే విధంగా తమ ఉంగరాలు ఇప్పుడు బ్లాక్‌చెయిన్‌లో ఉన్నాయని వధువు రోజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రింగులు ఇప్పుడు ఒకదానికొకటి క్రిప్టోకరెన్సీ వాలెట్లో ఉన్నాయి.
ఉంగరాలు మాత్రమే కాదు, మా ప్రతిజ్ఞలు కూడా వాస్తవంగా మార్పిడి చేయబడ్డాయి అని రాశారు. ‘మేం ఇద్దరూ కాయిన్‌బేస్‌లో పనిచేస్తున్నందున మా వివాహం కోసం @ / ఐఫెలిక్స్ @ / ఎథెరియం స్మార్ట్ కాంట్రాక్ట్‌ను రాశాను. ఇది క్రిప్టోకరెన్సీ వాలెట్లకు డిజిటల్ కళాకృతులను టోకెన్లుగా (ఎన్ఎఫ్టీ) జారీ చేసింది. వారు టోకెన్‌కు ‘తబాత్’ అని పేరు పెట్టారు. తబాత్ అంటే హిబ్రూ భాషలో ఉంగరాలు’ అని రోజ్ తన ట్వీట్లో పేర్కొన్నది.
ఈ వేడుక ఆసక్తికరంగా ఉండటమే కాకుండా ఒకే ఆసక్తులను పంచుకునే ఇద్దరు వ్యక్తులను కూడా నిర్వచిస్తుండటం విశేషం. ఈ కారణంగానే ఈ పోస్ట్‌ను నెటిజన్లు అనేకసార్లు రీట్వీట్ చేయడంతో ట్విట్టర్లో వైరల్ అయ్యింది. ‘ఇలాంటిది సాధ్యమవుతుందని కొన్నేండ్ల క్రితం ఎవరైనా భావించారా?’ అని ఒక నెటిజెన్ బదులిచ్చారు.
చాలామంది ఈ జంటను అభినందించగా, కొందరు మొత్తం విధానం గురించి ఆసక్తిగా ఉన్నారు. మరో వినియోగదారు.. ‘మీ ఇద్దరికీ అభినందనలు. కానీ ఎవరైనా స్మార్ట్ కాంట్రాక్టును హ్యాక్ చేసి ఎన్ఎఫ్టీని కాల్చివేసినట్లయితే..?’ అని కొత్త జంటను ప్రశ్నించాడు.
నిజమే కదూ! ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
In addition to a traditional Jewish ceremony, we wanted to solidify our vows in a more personal way. Since we both work at @Coinbase, @_iphelix wrote an @Ethereum smart contract for our marriage that issued digital artwork as tokens (#NFTs) to our cryptocurrency wallets. 2/7 pic.twitter.com/uYB8MXGlgn
— Rebecca Kacherginsky (@rgoldilox) April 2, 2021
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్‌కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..