ACB | రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. వంశీ మోహన్‌కు సంబంధించి 8 ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేపట్టింఇ. వంశీ మోహన్ శేరిలింగంపల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆర్డీవో పనిచేసిన సమయంలో వంశీ మోహన్ పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తులు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆదాయనికి మించి ఆస్తులు సంపాదించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల భూమి కాజేసినట్లు తన మామ పేరుపై రిజిస్టేషన్ చేయించి రియల్టర్‌కు దారాదత్తం చేశాడు. ఓ రియల్టర్ నుంచి 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వంశీ మోహన్‌పై రూ.వందల కోట్ల ఆస్తులు సందించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.