హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి భూముల దోపడీ మీద ఉన్న శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భూ హారతి ద్వారా కేసముద్రంలో అసైన్డ్ పట్టాలు ఆక్రమించాడని ఆరోపించారు. శంషాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు 90 ఎకరాల సీలింగ్ భూమిని తహసీల్దార్, కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చి వేల కోట్ల భూమిని దోపిడీ ఎలా చేశారో ఏసీబీ దాడిలో దొరికారు. అయినా కూడా ఇలాంటి వాటిపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడని విమర్శించారు.
ధాన్యం కొనుగోళ్లు చేపట్టక రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ధాన్యం కొనుగోళ్లపై చేపట్టిన సమీక్ష తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. డబ్బు సంచుల మీద ఉన్న శ్రద్ధ ధాన్యం సంచుల సేకరణలో లేదని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా వడ్లు కొనక 45 రోజుల్లో 10 మంది చనిపోతే ఒక్కరు కూడా చనిపోలేదని సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. మంత్రి సొంత జిల్లాలో మహ్మద్ నసీరుద్దీన్ అనే రైతుల ధాన్యం రాశిపైనే మృతి చెందాడన్నారు.
జనగామ జిల్లా ఏనెబావిలో కాంటాలు పెట్టడంలేదని కాంగ్రెస్ కార్యకర్తలే ఆందోళన చేరన్నారు. ఇనేక సంఘటనలు జరిగాయన్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు మా పార్టీ నాయకుడికి ఫోన్ చేసి, ధాన్యం ప్రభుత్వం కొనుడు ఎందయ్యా, మాకు లేని పని పెట్టిండు మీ కేసీఆర్ అని చెప్తున్నాడు ఓ కాంగ్రెస్ నాయకుడు మా పార్టీ నాయకుడికి ఫోన్ చేసి ధాన్యం ప్రభుత్వం కొనుడు ఎందయ్యా, మాకు లేని పని పెట్టిండు మీ కేసీఆర్ అని చెప్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పటివరకు 35% ధాన్యం కూడా కొనుగోలు చేయలేదన్నారు.
కానీ రేవంత్ రెడ్డి, అతని మంత్రులు 80% కొనుగోలు చేశామని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. రైతుల ఇబ్బందుల మీద అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఊరికైనా పోదాం.. ఎక్కడన్నా మీరు చెప్పినట్లు 80 శాతం పంట కొనుగోళ్లు చేశారని నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. రేవంత్‌లో అగౌరవంగా మాట్లాడే భాష తనకు రాదన్నారు.
LIVE : KTR Press Meet at Telangana Bhavan https://t.co/tCmMZv5SQc
— Telugu Scribe (@TeluguScribe) May 22, 2026