సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం రాత్రి 9గంటల వరకు శామీర్పేట్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఒక సెం.మీ వరకు వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు గ్రేటర్ పరిధిలోని సరూర్నగర్లో అత్యధికంగా 7.5 సెం.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. రాగల మరో రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.